కరోనా నిబంధనల నడుమ ఏపీలో రేపటి నుండి ఇంటర్ పరీక్షలు

ఏపీలో రేపటి నుండి ఇంటర్ పరీక్షలు నిర్వహించబోతున్నారు. ఇందుకోసం జిల్లాలో 74 పరీక్ష కేంద్రాలను గుర్తించారు. కరోనా నిబంధనల నడుమ పరీక్షలు జరుగనున్నాయి. ఇంటర్‌ పరీక్షలను రద్దు చేసి అందరినీ ఉత్తీర్ణులు చేస్తూ ఈ ఏడాది జూన్‌ 24న ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. తద్వారా జిల్లాలో 53 వేల మంది పరీక్షలు రాయకుండానే ఉత్తీర్ణులయ్యారు.అయితే మార్కుల కేటాయింపుపై కొందరు అసంతృప్తి వ్యక్తంచేశారు. పరీక్షలు నిర్వహించి ఉంటే అధికంగా వచ్చేవని అభిప్రాయపడ్డారు. విద్యార్థులు, తల్లిదండ్రుల కోరికపై పరీక్షలు రాయాలనుకునే వారి కోసం రేపటి నుండి పరీక్షలు నిర్వహించబోతున్నారు.

రేపటి నుంచి ఈ నెల 23 వ తేదీ వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్‌ ప్రథమ సంవత్సర విద్యార్థులు మరియు మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు సెకండీయర్‌ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ప్రశ్నా పత్రరాలను పోలీస్‌ స్టేషన్‌ లో భద్ర పరిచారు అధికారులు.