కరోనాకు మరో ఔషధం..డీసీజీఐ అనుమతి

న్యూఢిల్లీ: కరోనా వైరస్ చిక్సితలో వినియోగించేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) మరో ఔషధానికి అనుమతి ఇచ్చింది. కరోనా పేషెంట్లకు అత్యవసర సమయాల్లో వాడేందుకు ఇటోలీజుమ్యాజ్ అనే ఇంజెక్షన్ మందుకు అనుమతులు ఇచ్చింది. కరోనా పేషెంట్లపై ఈ మందును ప్రయోగించగా సంతృప్తి కర ఫలితాలు వచ్చాయి. సహజంగా… దీన్ని చర్మ వ్యాధి అయిన సొరియాసిస్ ను తగ్గించేందుకు వాడుతున్నారు. బెంగళూరులోని బయోకాన్ బయో ఇండియా లిమిటెడ్ ఈ మందుకు సొరియాసిస్‌కి వాడేందుకు చాలా ఏళ్ల కిందట అనుమతి పొందింది. ఇప్పుడు అదే మందు కరోనాకీ పనిచేస్తోంది. ఇటోలీజుమ్యాజ్ చాలా పవర్ఫుల్. అందుకే కరోనా పేషెంట్లందరికీ దీన్ని ఇవ్వరు. కరోనా చాలా తీవ్రంగా ఉంది, ప్రాణాలు పోయేలా ఉన్నాయి అనే పరిస్థితి ఉంటేనే ఇస్తారు.
కరోనా అంతు చూసే యాంటీబాడీల ఉత్పత్తికి కృషి చేసే సైటోకిన్లను ఉత్పత్తి చేయడంలో ఇది బాగా పనిచేస్తోంది. ఎయిమ్స్‌కు చెందిన కొందరు నిపుణులు ఈ మందుతో ప్రయోగాలు చేశారు. ఈ ప్రయోగాలు సత్ఫలితాలు ఇచ్చాయి. ఇది ఎక్కువ పవర్ఫుల్ కాబట్టి… మందును తీసుకోవాలనుకునేవారు… ముందుగానే… అంగీకారం తెలుపుతూ… పేపర్‌పై రాసి సంతకం పెట్టాల్సి ఉంటుంది. ఈఇటోలీజుమ్యాజ్ని… మే నెలలో ముంబైలోని నాయిర్ హాస్పిటల్ వాడి చూసింది. వెంటిలేటర్‌తో ఉన్న ఇద్దరు రోగులకు ఇచ్చింది. వాళ్లు కోలుకొని సాధారణ స్థితికి వచ్చారు. ఈ మందు చాలా వరకూ ఒక డోస్ ఇవ్వగానే… రోగులు కోలుకుంటున్నారు. కొంత మందికి మాత్రం 3 డోసుల దాకా ఇవ్వాల్సి వస్తోంది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/