షాహీన్‌బాగ్ ప్రాంతంలో భద్రత కట్టుదిట్టం

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై వ్యతిరేక నిరసనలకు కేంద్రంగా ఉన్న ఢిల్లీలోని షాహీన్‌బాగ్ ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అదనపు బలగాల్ని మోహరించారు. పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 144 విధించారు. సమావేశాలు నిర్వహించొద్దని పోలీసులు వీధుల్లో తిరుగుతూ ప్రజలకు తెలిపారు. ఈశాన్య ఢిల్లీలో చోటుచేసుకున్న ఘర్షణల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/