చంద్రబాబు ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావించడం లేదు?

వైఎస్సార్‌ మండలిని పునరుద్ధరించడాన్ని పదేపదే చెబుతున్నారు

vijayasai reddy
vijayasai reddy

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడిపై వెస్సార్‌సిపి ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామరావు మండలిని రద్దు చేసిన విషయాన్ని ఎల్లోమీడియా, చంద్రబాబు నాయుడు గ్యాంగ్‌ ప్రస్తావించడంలేదని ఆయన విమర్శించారు. వైఎస్‌ రాజశేఖరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మండలిని పునరుద్ధరించడాన్ని పదేపదే చెబుతున్నారని ఎద్దేవా చేశారు. 1985, 2005లో రెండు సందర్భాల్లో మండలి ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఉపన్యాసం ఇచ్చిన చంద్రబాబు నాయుడి ద్వంద వైఖరి వీడియోలా సాక్షిగా బయటపడిందని విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/