అమెజాన్‌ అధిపతి.. సరికొత్త రికార్డు

జెఫ్ బెజోస్..15 నిమిషాల్లో రూ.94 వేల కోట్ల సంపాదన

Jeff Bezos
Jeff Bezos

అమెరికా: అమెజాన్‌ అధిపతి జెఫ్‌ బోజోస్‌ 15 నిమిషాల్లో రూ.94,276 కోట్ల సంపాదనను కూడగట్టుకున్నారు. ఇకామర్స్ కంపెనీ అమెజాన్ నాలుగో త్రైమాసిక ఫలితాలు విడుదలైన కొన్ని క్షణాల్లో వాల్ స్ట్రీట్‌లో జరిగిన అద్భుతం ఇది. డిసెంబర్ త్రైమాసికంలో అమెజాన్ లాభం 8% పెరిగింది. అంటే 3.3 బిలియన్ డాలర్లు. అంతే త్రైమాసిక ఫలితాలు విడుదల కాగానే న్యూయార్క్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో ఒక్కసారిగా Amazon.com Inc. . స్టాక్ 12% పుంజుకుని 2,100 డాలర్లకు చేరుకుంది. Amazon.com Inc. షేర్ ధర పెరగడంతో అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ సంపాదన కూడా అమాంతంగా పెరిగిపోయింది. కేవలం 15 నిమిషాల్లో తనకు ఉన్న సంపాదనకు మరో రూ.94,276 కోట్లు అదనంగా చేరడం సంచలనమే. ఇప్పటికే 56 ఏళ్ల జెఫ్ బెజోస్ ప్రపంచంలోనే ధనవంతుడు. అంతేకాదు… సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ప్రస్తుతం ఆయన నెట్ వర్త్ 129.5 బిలియన్ డాలర్లు. అంటే రూ.9 లక్షల కోట్లకు పైనే ఉంటుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/