16ఏళ్లకే వరల్డ్‌కప్‌ ఛాన్స్‌ అందరికీ రాదు

విధ్వంసక బ్యాట్స్‌ వుమన్‌ షెఫాలీ వర్మ

Batswoman Shefali Verma

ముంబయి: భారత మహిళా క్రికెట్‌లో ఏడాదికాలంగా మారుమోగుతున్న పేరు షెపాలి వర్మ,

ఇటీవల ఆస్ట్రేలియా వేదికగా జరిగిన వుమన్స్‌ టీ20 వరల్డ్‌కప్‌ లో పరుగుల వరద పారించిన ఈ 16 ఏళ్ల యువతి ఒంటిచేత్తో టీమ్‌ని ఫైనల్‌కి చేర్చింది.

కానీ ఫైనల్‌లో షెఫాలి తొలి ఓవర్‌లోనేఔట్‌ అవడంతో ఒత్తిడికి గురైన భారత్‌జట్టు 85 పరుగులతేడాతోఆసీస్‌టీమ్‌ చేతిలో ఓడిపో యింది.

అవార్డు ప్రధానోత్సవంలో షెఫాలి కంటకన్నీరు చూసి అభిమానులు కూడా కన్నీటి పర్యంతమయ్యారు.

ఈ నెలరోజులు నాకు చాలా ప్రత్యేకమని, బెస్ట్‌క్రికెటర్లతోకలిసి ఇంత చిన్నవయసులో వరల్డ్‌కప్‌ ఆడే లక్కీఛాన్స్‌ అంద రికీ దొరకదని అది నాకుమాత్రమే వచ్చిందని తెలిపింది.

ప్రపంచ కప్‌తర్వాత మా సొంత ఊరు రోహతక్‌లో నాకు లభించిన స్వాగతం ఎప్పటికీ మరిచి పోలేను

. డ్రమ్‌, మ్యూజిక్‌తో ఒకటే హంగామా మాబంధువులు అయితే దం డలతో నాకు స్వాగతం పలికారు. ప్రపంచకప్‌ తర్వాత ఈరకమైన స్వాగతం నాకు ఓ కలలా అనిపించిందని షెపాలీవర్మ వెల్లడించింది.

దక్షిణాఫ్రికాతో గత ఏడాది జరిగిన టీ20 సిరీస్‌లో భారత మహిళల క్రికెట్‌జట్టులతోకి అరంగేట్రంచేసిన షెఫాలివర్మ ఆడిన 19 మ్యాచ్‌ల్లో 487 పరుగులుచేసింది.

ఇందులో రెండు అర్థసెంచరీలుకూడ ఆఉన్నాయి. ఇక టీ20 ప్రపంచకప్‌లో కూడా ఐదు మ్యాచ్‌లు ఆడిన షెఫాలి వర్మ 163 పరుగులుచేయగా ఆమె స్ట్రెక్‌రేట్‌ ఏకంగా 158.25గా ఉండటం దూకుడుకు నిదర్శనం.

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/