కరోనాపై యువి, కైఫ్‌లా పోరాడాలి

ట్విట్టర్‌లో మోడీ పిలుపు

Modi tweet
Modi tweet

న్యూఢిల్లీ: నార్త్‌వెస్ట్‌ సిరీస్‌ ఫైనల్‌లో భారత మాజీ క్రికె టర్లు యువ రాజ్‌సింగ్‌, మహ్మద్‌కైఫ్‌ పోరాడిన రీతిలో మహమ్మారి కరోనా వైరస్‌పై యావత్‌దేశం పోరాడాలని ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు.

ప్రపంచాన్ని వణి కిస్తున్న కరోనా రోజురోజుకూ తన పంజా విసు రుతున్న సంగతి తెలిసిందే. భారత్‌లో ఇప్పటికే250 మందికి సోకిన కరోనా మరింత ఉదృతం అవుతోంది. ఐదుగురు మృత్యువాతపడ్డారు.

భారత్‌లో విజృంభిస్తున్న కరోనా వైరస్‌ను నివారించడానికి ప్రధాని మోడీ జనతా కర్ప్యూ పిలుపునిచ్చినసంగతి తెలిసిందే.

ఆదివారం ఉదయం ఏడు గంటలనుంచి రాత్రి తొమ్మిది గంటలవరకూ ప్రజలు స్వఛ్ఛందాంగా జనతా కర్ఫ్యూ పాటించాలని మోడీ కోరారు.

అత్య వసరమైతే తప్ప అంతా కూడా స్వీయ నిర్బంధాన్ని పాటించాలన్నారు. ప్రధాని విన్నపాన్ని స్వాగతిస్తూ భారత క్రికెటర్లు ప్రముఖులు సామాజిక మాద్యమాల్లో మద్దతునిచ్చారు.

సచిన్‌టెండూల్కర్‌, కోహ్లీ, మహ్మద్‌కైఫ్‌, యువరాజ్‌సింగ్‌లు ట్వీట్లు చేసారు. కరోనా వైరస్‌పై ప్రధానిమోడీచేసిన సూచన చాలా ముఖ్యమైనదని జనతా కర్ఫ్యూతో దేశం యుద్ధాన్ని ప్రకటించినప్రమంలోప్రధాని సూచనను అంతా పాటిం చాలని కైఫ్‌కోరాడు.

ప్రజలు స్వఛ్ఛందంగా జనతా కర్ఫ్యూ పాటించాలని యువీ అన్నాడు.

దీనిపై ప్రధాని మోడీ తనట్వీట్‌తో స్పందించారు. మరోభాగస్వామ్యానికి సమయం వచ్చిందని, కరోనాపై పోరాటానికి భారత్‌ మొత్తం భాగస్వామ్యం కావాలన్నారు.

ఇదిలా ఉంటే ఇంగ్లండ్‌మాజీ కెప్టెన్‌ కెవిన్‌పీటరసన్‌ ప్రశంసల జల్లుకురిపిం చాడు.

మోదీ నాయకత్వ లక్షణాలు అత్యంత విస్ఫోటనకరమైనవని అన్నాడు. పీటర్సన్‌ ముందురోజు హిందీలో ఒక ట్వీట్‌చేసాడు.

మన మంతా వైరస్‌ను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలని, అంతా కలిసి కట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలని సూచిం చాడు .ఈ ట్వీట్‌పై ప్రధానిమోడీ స్పందించి పీటర్సన్‌ సమయోచితంగా స్పందించారని ప్రశంసించారు.

మోడీ స్పందనపై తాజాగా పీటర్సన్‌ ట్విట్టర్‌లో స్పందించారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం: https://www.vaartha.com/specials/career/