టీమిండియాకు ఊహించని షాక్‌

ఆ మ్యాచ్‌లకు ఆడని రోహిత్‌ శర్మ

Rohit Sharma
Rohit Sharma

వెల్లింగ్టన్: న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమిండియాకు ఊహించని షాక్‌ తగిలింది. తిరుగులేని విధంగా కొనసాగిస్తున్న టీమిండియాకు ఇది నిరాశ కలిగించే విషయం! టి20 సిరీస్ లో గాయపడిన వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ కాలి పిక్క గాయంతో వన్డే, టెస్టు సిరీస్ లకు దూరమయ్యాడు. ఆదివారం కివీస్ తో జరిగిన ఐదో టి20 మ్యాచ్ లో బ్యాటింగ్ చేస్తుండగా రోహిత్ శర్మ కండరాలు పట్టేయడంతో బ్యాటింగ్ కొనసాగించలేక పెవిలియన్ కు వెళ్లిపోయాడు. ఆ తర్వాత మైదానంలో దిగలేదు. ఈ నేపథ్యంలో, రోహిత్ గాయం తీవ్రత ఎక్కువగానే ఉందని, న్యూజిలాండ్ తో మూడు వన్డేలు, రెండు టెస్టులకు రోహిత్ దూరమవుతాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. కివీస్ తో వన్డే సిరీస్ బుధవారం ప్రారంభం కానుంది. ఇటీవల అన్ని ఫార్మాట్లలోనూ అదరగొడుతున్న రోహిత్ శర్మ లేకపోవడం టీమిండియాపై ప్రభావం చూపే అవకాశముంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/