కౌన్సిల్‌లో ప్రజల పక్షానా పోరాడాలి

కార్పొరేటర్లు ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా నిర్వర్థించాలి

Revanth Reddy
Revanth Reddy

హైదరాబాద్‌: కార్పొరేషన్‌లలో కాంగ్రెస్‌ పార్టీ తరఫున గెలిచిన కార్పొరేటర్లు ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా నిర్వర్తించాలని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి వారికి సూచించారు. గురువారం బోడుప్పల్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్పొరేషన్‌ అధ్యక్షుడు పోగుల నర్సింహ్మరెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా గెలిచిన కార్పొరేటర్లు రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గెలిచిన కార్పొరేటర్లు కౌన్సిల్‌లో ప్రజల పక్షానా పోరాడాలని, ప్రజల సమస్యలను తీర్చడంలో ముందుండాలన్నారు. అనంతరం గెలుపొందిన కార్పొరేటర్లను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పోగుల నర్సింహారెడ్డి, కొత్త దుర్గమ్మ, కొత్త స్రవంతి, బొమ్మక్‌ కల్యాణ్‌, తోటకూర అజయ్‌, మాజీ వార్డు సభ్యుడు కొత్త కిషోర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/