బ్రెగ్జిట్‌ ఒప్పందానికి ఐరోపా పార్లమెంట్‌ ఆమోదం

European Parliament
European Parliament

లండన్‌: ఈ నెల31న యూరోపియన్‌ యూనియన్‌ (ఇయూ) నుంచి బ్రిటన్‌ వైదొలిగే బ్రెగ్జిట్‌ ఒప్పందానికి ఐరోపా పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. దాదాపు 50 ఏండ్ల పాటు ఇయూలో సభ్యదేశంగా కొనసాగిన బ్రిటన్‌ ఇక నుంచి స్వతంత్య్ర రాజ్యంగా ఏర్పడనుంది. ఇయూ పార్లమెంట్‌లో భావోద్వేగాల నడుమ 62149 ఓట్ల తేడాతో చట్టసభసభ్యులు బ్రెగ్జిట్‌కు అంగీకారం తెలిపారు.
బ్రిటన్‌ చరిత్రలో కీలక ఘట్టమైన బ్రెగ్జిట్‌కు మార్గం మరింత సుగమమైంది. శనివారం ఇయూ నుంచి బ్రిటన్‌ వైదొలగనున్న నేపథ్యంలో బ్రెగ్జిట్‌ ఒప్పందానికి తాజాగా ఐరోపా పార్లమెంట్‌ ఆమోదముద్ర వేసింది. బ్రిటన్‌తో ఇయూకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ చట్టసభ సభ్యులందరూ భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం 62149 ఓట్ల తేడాతో బ్రెగ్జిట్‌కు అంగీకారం తెలిపారు. ‘ఆల్డ్‌ లాంగ్‌ సైన్‌’ అనే సంప్రదాయ పాటతో బ్రిటన్‌కు వీడ్కోలు పలుకుతూ.. దాదాపు 50 ఏండ్ల పాటు సాగిన తమ స్నేహాన్ని స్మరించుకున్నారు. బ్రెగ్జిట్‌ ఒప్పందానికి క్వీన్‌ ఎలిజబెత్‌2 గతంలోనే అధికారిక ముద్ర వేయగా ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కూడా సంతకం చేశారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/