వారియర్ నుండి ‘దడ దడ’ సాంగ్ రిలీజ్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ – ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి జంటగా తమిళ డైరెక్టర్ లింగుసామి డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ ‘ది వారియర్’. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం నుండి సెకండ్ సింగిల్ వచ్చేసింది. ఇప్పటికే బుల్లెట్ సాంగ్ విడుదలై శ్రోతలను విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ పాటను కోలీవుడ్ స్టార్ శింబు, హరిప్రియ పాడారు. శ్రీమణి లిరిక్స్ అందించారు. ఈ పాటకి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీని అందించాడు. పాటకి తగిన స్టెప్పులతో రామ్ – కృతి శెట్టి చెలరేగిపోయారు.

ఇక ఇప్పుడు ‘దడ దడ’ అనే సెకండ్ సింగిల్ ని విలక్షణ దర్శకుడు గౌతమ్ మీనన్ రిలీజ్ చేశారు. ‘దడ దడమని హృదయం శబ్దం.. నువ్వు ఇటుగా వస్తావని అర్థం.. బడబడమని వెన్నెల వర్షం.. నువ్వు ఇక్కడే ఉన్నావని అర్థం’ అంటూ సాగిన ఈ మెలోడీ శ్రోతలను విపరీతంగా అలరిస్తుంది. కృతి ప్రేమలో మునిగి తేలుతున్న రామ్.. తన ఫీలింగ్స్ ని ఈ పాట ద్వారా వివరిస్తున్నారు. తొలిసారిగా కలిసి నటిస్తున్న రామ్ – కృతి జంట స్క్రీన్ పై అందగా కనిపిస్తోంది. ప్రతి సినిమాలో ఒక్కటైనా బ్యూటీఫుల్ మెలోడీకి అందించే రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్.. ఇప్పుడు ‘దడ దడ’ పాటకు స్వరాలు సమకూర్చారు. శ్రీమణి సాహిత్యం అందించగా.. సింగర్ హరి చరణ్ ఈ గీతాన్ని ఆలపించారు. సుజీత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేశారు.

ఇక ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో ఆది పినిశెట్టి పవర్ ఫుల్ విలన్ రోల్ లో కనిపించనుండగా.. అక్షర గౌడ కీలక పాత్ర పోషించింది. నదియా – నాజర్ ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటించారు.

YouTube video