అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారు..ఈటల

హుజూరాబాద్ ప్రజల ముందు ఆయన డబ్బులు పని చేయవు

హైదరాబాద్: బీజేపీ నేత ఈటల రాజేందర్ సీఎం కెసిఆర్ పై విమర్శనాస్త్రాలకు మరింత పదును పెడుతున్నారు. ఈరోజు ఆయన కమలాపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ తీరుపై మండిపడ్డారు. ఒడ్డు ఎక్కేదాక ఓడ మల్లన్న.. ఒడ్డు ఎక్కిన తర్వాత బోడ మల్లన్న తరహాలో కేసీఆర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అధికారం కోసం కేసీఆర్ ఎంతకైనా తెగిస్తారని దుయ్యబట్టారు. డబ్బులు, కుట్రలను నమ్ముకుని ఆయన ఎన్నికలకు వస్తారని ఆరోపించారు. అయితే హుజారాబాద్ ప్రజల ముందు కేసీఆర్ డబ్బులు, కుట్రలు పని చేయవని అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని హుజూరాబాద్ ప్రజలు అమ్ముకోరని చెప్పారు.

‘‘నేను ప్రజల ప్రేమను నమ్ముకుని ముందుకు వెళుతున్నా. కేసీఆర్ కుట్రలను నమ్ముకున్నాడు. తెనేపూసిన కత్తిని కడుపులో పెట్టుకుని కుట్రలు చేస్తే హుజూరాబాద్ ప్రజలు సహించరు. నువ్వు కోట్లు ఖర్చు చేసి ఎమ్మెల్సీ స్థానాలు గెలవవచ్చు. కోట్లు కుమ్మరించి హుజూర్ నగర్, నాగార్జున సాగర్ గెలవచ్చు. కానీ హుజూరాబాద్‌లో నీ కుట్రలు సాగవు బిడ్డా’’ అంటూ విమర్శలు చేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/