పెనుముప్పుగా మారుతున్న ప్లాస్టిక్‌ వినియోగం

భావితరాల మనుగడకే ముప్పు?

The use of plastic as a panacea
The use of plastic as a panacea

ప్రపంచవ్యాప్తంగా దేశాలు, రాష్ట్రాల ప్రభుత్వాల అధి కార ప్రతినిధులు, పర్యావరణవేత్తలు ప్లాస్టిక్‌ వినియోగం వల్ల కలిగే అనర్థాలను చర్చిస్తూ ప్లాస్టిక్‌ రహితంగా మారుస్తామని వాగ్దానాలివ్వడం జరుగుతుంది.

ఆ తర్వాత ఏదో మొక్కుబడిగా చట్టాలు చేస్తారు.1950 నుండి మెటల్‌ కొరత వలన ప్లాస్టిక్‌ ఉత్పత్తిని ప్రారంభించారు.

ప్రపంచీ కరణ నేపథ్యంలో భాగంగా శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం పెరుగు దలే ప్లాస్టిక్‌ వినియోగాన్ని పెంచి పర్యావరణ కాలుష్యానికి దోహద బడుతున్నాయని చెప్పవచ్చు.

ఒక్కటేమిటి మానవ్ఞలు వాడే ప్రతి వస్తువు మొబైల్‌, టివీలు, కంప్యూటర్లు, వాహనాలు, టేబుల్స్‌, కుర్చీల తయారీలో ఎక్కువగా ప్లాస్టిక్‌ను వాడటం జరుగుతుంది.

ఇవియే కాకుండా పాత్రలు, టిఫిన్‌ బాక్సులు, వాటర్‌ బాటిల్స్‌, గ్లాసులు, చెంచాలు, కప్‌లు, పాలిథిన్‌ కవర్స్‌ కూడా తయార య్యేది ప్లాస్టిక్‌తోనే.

ప్రపంచవ్యాప్తంగా ప్రతియేటా 500 బిలియన్‌ బ్యాగ్స్‌ వాడకం జరుగుతుంటే 8 మిలియన్స్‌ టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు సముద్రాలలో కలుస్తున్నాయి.

మహాసముద్రాలలో పడే స్తున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలలో 60 శాతం వాటా భారతదేశానిది కావ డం ఆందోళన కలిగించే విషయం.

2017లో ప్రచురించిన ఎన్వి రాన్మెంటల్‌ సైన్స్‌ టెక్నాలజీ గ్లోబల్‌ జర్నల్‌ ప్రకారం గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదులు ప్లాస్టిక్‌ వ్యర్థాలను మోసుకుపోయి సముద్రాలలో కలుపుతున్నాయని వెల్లడించింది.

2010 నుంచి ప్లాస్టిక్‌పై నిషేధం విదిస్తూ 2022 వరకు ప్లాస్టిక్‌రహితంగా మారుస్తామని సెలవిచ్చారు. కానీ ఇది అమలయ్యే అవకాశం కంటిచూపుమేరలో కనిపించడం లేదన్నది వాస్తవం.

కేంద్ర కాలుష్యనియంత్రణ మండలి గణాంకాల ప్రకారం రోజు 1500 టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఉత్ప న్నమవ్ఞతుంటే, 900 టన్నులు రీసైకిలింగ్‌కు తరలిస్తే, మిగతా 600 టన్నులు కాలువలు, నదులలో డంపింగ్‌ చేయడం జరుగు తుంది.

ప్లాస్టిక్‌ కాలుష్యంతో ఏటా 10లక్షల పక్షులు, లక్ష సముద్ర క్షీరదాలు చనిపోతున్నాయని పలు నివేదికల గణాంకాలు తెలుపు తున్నాయి.

2050 నాటికి సముద్రాలలో చేపల కంటే ప్లాస్టిక్‌ వ్యర్థాలే ఎక్కువగా ఉంటాయని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిం చడం సగటు వ్యక్తిని ఆందోళన కలిగించే విషయమని చెప్పకతప్ప దు.

ఎన్నోరకాల ప్లాస్టిక్‌ పదార్థాలు పర్యావరణ కాలుష్యానికి దారి తీసి, సమస్త జీవకోటి మనుగడకు పెనుముప్పుగా మారుతుంది.

ప్లాస్టిక్‌ భూమితో కలవడానికి దాదాపు 450 ఏళ్లు తీసుకుంటే శిథిలమవ్వడానికి వెయ్యి ఏళ్లు పడుతుందని, మరికొన్ని రకాల ప్లాస్టిక్‌ వ్యర్థాలు భూమిలోశిథిలమయ్యే అవకాశాలే లేవని, వాటిని అగ్గితో రూపుమాపడానికి 1.5 బిలియన్‌ బ్యారర్ల చమురు అవసరం ఏర్పడుతుందని నిపుణులువెల్లడిస్తున్నారు.

పాలు,పెరుగు, కూరగాయలు, కర్రీస్‌ రకరకాల వస్తువ్ఞలు ఏం తేవాలన్నా పాలిథిన్‌ కవర్ల వాడకమే జరుగుతుంది.

ఏ శుభ, అశుభ కార్యాలు నిర్వహించాలంటే చాలు టీకప్పులు, గ్లాసులు, ఐక్‌క్రీంకప్‌లు, స్పూన్స్‌, ప్లేట్స్‌, వాటర్‌ బాటిల్స్‌,కూల్‌డ్రింక్స్‌ ఇలా ప్రతిదీ ఒక్క సారి ఉపయోగించి పడేసే ప్లాస్టిక్‌ వస్తువ్ఞలు వాడి పనులు తప్పిం చుకుంటున్నారు.

0 లక్షల ప్లాస్టిక్‌బాటిల్స్‌ ఉపయోగిస్తే అందులో 14 శాతం మాత్రమే రీసైకిలింగ్‌ జరిగి,మిగతా వ్యర్థాలు కొండల్లా పేరు కుపోయి ఎక్కడపడితేఅక్కడ మురికికాలువలలో పడేయడంజరుగు తుంది.

వర్షం వస్తేచాలు నీటి పారుదల జరుగక కాలువలు నిండిపోయి మురికి నీరంతా ఇళ్లలోపలికి వచ్చి ప్రజారో గ్యానికి ప్రమాదకరంగా మారుతుందనడంలో ఎలాంటి అనుమానం అక్కరలేదు.

ప్లాస్టిక్‌ను ఎక్కువగా పెట్రోలియం, క్రూడ్‌ ఆయిల్‌తో తయారు చేయడం మూలంగా వినియోగించడంతో కేన్సర్‌ లాంటి రోగాల బారినపడాల్సి వస్తుంది.

నాణ్యత తక్కువ గల కవర్లలో వేడి పదార్థాలను వినియోగిస్తే రసాయనిక చర్యలకు పాల్పడి అనా రోగ్య పరిస్థితులకు కారణమవ్ఞతున్నది.

ప్లాస్టిక్‌ వ్యర్థాలను కాల్చివేసే ప్రక్రియలో వెలువడే వాయువ్ఞలు సైతం ప్రజల ప్రాణాపాయాలకు దారితీస్తుంది.

పర్యావరణ కాలుష్యానికి పెనుముప్పుగా మారుతున్న సందర్భంలో సమస్య పరిష్కారానికి మార్గాల ను అన్వేషించి, అమలుపరచడానికి చర్యలు తీసుకోవాలి.

-డా.పోలం సైదులు

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/