ప్రజావాక్కు

సమస్యలపై ప్రజాగళం

Voice of the people
Voice of the people

భారత్‌ సత్తా చూపించాలి: – డా.దన్నాన అప్పలనాయుడు, పార్వతీపురం

భారత సరిహద్దుల్లో హద్దు మీరి ప్రవర్తిస్తున్న చైనా సైనికులు నీతినిజాయితీలకు నీళ్లొదిలారు. ఎందుచేతనంటే ప్రపంచంలో అధిక్యాన్ని కనపరచడమేదాని కుయుక్తితప్ప ప్రపంచ శాంతి కోసం పాటుపడిన దాఖలాలు దానిచరిత్రలోలేవు,.

సరిహద్దుల లో చర్చలకెళ్లినప్పుడు నిరాయుధులుగా వెళ్లాలనే కట్టుబాట్లను పాటించిన భారత సైన్యం ఇరవై మందిని నిర్దాక్షిణ్యంగా పొట్ట న పెట్టుకోవడం ప్రతిభారతీయపౌరుడు జీర్ణించుకోలేకపోతు న్నాడు.

చైనీయులలో క్రూరత్వం సహజంగా ప్రబలుతుంది.

ఎందుచేతనంటే కుక్కలను కూడా వదలకుండా తినేసే రాక్షసు లకు మనుషులను చంపడానికి జంకక ముందుగానే ప్రణాళిక తో ముళ్లతో కూడిన సాధనాలను వెంటబెట్టుకొచ్చి దాడి చేయ డం తలచుకుంటే ప్రతి భారతీయుని ఆగ్రహానికి అంతుపట్టడం లేదు.

ఎవరి భూభాగాన్ని ఎవరు వొదులుకోగలరు. అందుచేత మనసరిహద్దులలో చైనీయులను ఎదిరించగలసత్తా మనకుంది.

హరితహారం హర్షణీయం:-సయ్యద్‌షఫీ, హన్మకొండ

అడవుల ప్రాశస్త్యాన్ని గుర్తించిన ప్రభుత్వం నేడు హరితహారం పవిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించింది. భారత జాతీయ అటవీ విధానం 1988 ప్రకారం పరిసరాల సుస్థిరత పర్యావరణ సమతుల్యం సాధించడానికి మొత్తం భౌగోళిక విస్తీర్ణం 33 శాతం అడవులు విస్తరించి ఉండేవి.

అడవ్ఞల శాతం తరిగిపో వడం వల్ల తెలంగాణ ప్రాంతంలో 24 శాతం అడవుల విస్తీర్ణం మాత్రమేఉంది. అడవ్ఞల విస్తీర్ణానికి హరితహారం కార్యక్రమం కంకణం కట్టుకుంది.అడవులవిస్తీర్ణం పెరగడంవల్ల వర్షపాతం, జంతువులు మనుగడ సాగించవచ్చు.

అడవుల నరికివేతవల్ల నీరు, ఆహారం లభించక జంతువ్ఞలు అడవులను విడిచి మను షులు నివసించే ఆవాస ప్రాంతాలలో ప్రవేశిస్తున్నాయి.

ఒక్కసారి ఆలోచించండి: -బట్టా రామకృష్ణ, సౌత్‌మోపూరు, నెల్లూరు

ఏవ్యక్తి అయినా సమస్యలు చట్టుముట్టాయని ఆత్మహత్యలకు పూనుకోవడం మంచిదికాదు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందనే విషయం మరవద్దు. ఏ సమస్య అయినా ఆత్మ విశ్వాసంతో జయించాలి.

కృషి, పట్టుదల, దృఢనిశ్చయంతో అనుకున్నది సాధించాలి తప్ప క్షణికావేశంలో చనిపోవాలనే నిర్ణయం సహేతుకం కాదు. వీలైనంత వరకు అలాంటి ఆలోచనల్ని తరిమికొట్టాలి.

జీవితంలో సర్వం కోల్పోయినా ఒక్కటి మాత్రం మిగిలి ఉంటుంది అదే మీ బంగారుభవిష్యత్తు అని గుర్తుంచుకోండి.

అన్నదాతలను ఆదుకోవాలి:-ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరుజిల్లా

ఈ సంవత్సరం రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల కారణంగా పంట పొలాలకు తీవ్రనష్టం జరిగినట్లు జాతీయ వ్యవసాయ సంఘం నివేదిక స్పష్టం చేస్తోంది.

అంతకుముందు ఖరీఫ్‌ సీజ న్‌లో వేసవితాకిడి, భూగర్భజల వనరుల మట్టం తగ్గిపోవడం, ప్రాజెక్టుల ద్వారా నీరు అందకపోవడం ఇత్యాది కారణాల వలన పంటలు వేయలేక రైతులు తీవ్రంగా నష్టపోయారు.

వాతావర ణంలో సంభవిస్తున్న అసహజమార్పుల వలన వ్యవసాయరం గం తీవ్రసంక్షోభంలో కూరుకుపోయింది.

కరోనా ప్రభావం వల న వ్యవసాయ ఉత్పత్తులను సకాలంలో మార్కెట్లకు చేర్చలేక కూరగాయలు, పండ్ల రైతులు నష్టపోయారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అన్నదాతలను ఆదుకునేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక చర్చలు, ప్రణాళికలు చేపట్టాలి.

భూరికార్డుల ప్రక్షాళన: -సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

పన్నెండో పంచవర్ష ప్రణాళిక కాలానికి మనదేశంలో భూముల పునఃసర్వే రికార్డుల ప్రక్షాళన, కంప్యూటీకరణ కార్యక్రమం పూర్తి కావాల్సి ఉంది. కాగా ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికే నిర్దేశిత లక్ష్యాలకు ఆమడదూరంలో నిలిచిపోయింది.

కాగా దేశంలో కేవలం 70శాతం సబ్‌రిజిష్టర్‌ కార్యాలయాలలో కంప్యూటీకరణ పూర్తయినట్లుగణాంకాలు వెల్లడిస్తున్నాయి. భూ రికార్డులు, రిజిస్ట్రేషన్‌ వ్యవహారాలకు సంబంధించి 56 శాతం మాత్రమే డిజిటలీకరణ పూర్తయింది.

మరొకపక్క దేశంలో ఆరు లక్షలకుపైగా గ్రామాలు ఉంటే భూముల సర్వే రికార్డుల ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం 1900 కోట్లు మాత్రమే విడుదలచేసింది.దేశంలో30శాతం సబ్‌రిజిస్ట్రే షన్‌ కార్యాలయాలకు ఇప్పటికీ ఇంటర్నెట్‌ సౌకర్యం లేదు.

మ్యాడ్‌ ఇన్‌ చైనా:-డా.డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం

ప్రపంచంలో చైనా తయారీ (మేడ్‌ ఇన్‌ చైనా) ఎంత ప్రాచుర్యం లోఉందో ఇప్పుడు చైనా పిచ్చితనం కూడా అంత ప్రాచుర్యం లోకి వస్తుంది. అదేమంటే పొరుగుదేశాల్ని ఇబ్బంది పెట్టి, తాను బలపడాలన్న వెర్రి వ్యామోహం. ఒకరకమైన సామ్రాజ్య వాదం.

మిగతా విషయాల సంగతి ఎలాఉన్నా భారత్‌తో వాస్త వాధీన రేఖపై చీటిమాటికి తీసుకువస్తున్న తలంపులు వెర్రిత లలు వేస్తున్నాయి.

ఇరు దేశాల ఒప్పందాల మేరకు అస్పష్టంగా ఉన్న సరిహద్దుపై యధాస్థితిని గౌరవించాలి, స్పష్టత కోసం చర్చలు కొనసాగాలి.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/