రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌తో అబద్దాలు చెప్పించారు

టిఆర్‌ఎస్‌ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేకపోయింది

rajasingh
rajasingh

హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కదానిని కూడా నిలబెట్టుకోలేపోయిందని బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతామన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో పాయింట్‌ వద్ద మాట్లాడుతూ..టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం గవర్నర్‌ తమిళిసైతో అసెంబ్లీలో అబద్దాలు చెప్పించారని రాజాసింగ్‌ ఆరోపించారు. ఇదే విషయంపై బిజెపి ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడుతూ గవర్నర్‌ ప్రసంగంలో కొత్తగా ఏమీ లేదని, పాత సీసాలో కొత్త సారా అనే సామెతలా ఉందన్నారు. విద్యార్థులను, నిరుద్యోగులను నిరాశపరిచే విధంగా గవర్నర్‌ ప్రసంగం ఉందన్నారు. నిరుద్యోగ భృతి విషయం ప్రస్తావించలేదని దుయ్యబట్టారు. గవర్నర్‌ ప్రసంగం అన్ని రంగాల్లో ప్రభుత్వం వైఫల్యం చెందినదని స్పష్టంగా తెలస్తోందని రామంచంద్రరావు తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/