బాలికల భద్రతకు భరోసా కల్పించాలి

బేటీ బచావ్‌, బేటీ పడావ్‌ పథకం ద్వారా బాలికలను సంరక్షించడం, బాలికల సంఖ్యను పెంచడం, వారి చదువ్ఞను కొనసాగించేలా చేయడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నది. ఎపి, తెలంగాణాలోని బాలికందరు చదువ్ఞకుంటున్నారని ఇటీవలే నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. అదే విధంగా చాలా మంది టీనేజ్‌ బాలికలు చదువ్ఞ తర్వాతే పెళ్లి అని తమ అభిప్రాయాలను వెల్లడించారు. దోపిడీకి, హింసకు,అత్యాచారానికి గురైనబాధితులకు సత్వర న్యాయం అందించి దోషులకు కఠినశిక్షలు విధించాలి. బాలికల హక్కులనుకాపాడాలి.సృష్టికి మూలమైన ఆడపిల్లలను పుట్టనిద్దాం.వారి బంగారు భవిష్యత్తు కు చేయూతనిద్దాం. ఆడపిల్లల పట్ల వివక్షతకు తావ్ఞలేకుండా ప్రతి ఒక్కరూ కృషి చేసినప్పుడే ఆడ,మగ వ్యత్యాసాలు సమసిపోయి ఆడపిల్ల అవనికి నిజమైన వెలుగు అవ్ఞతుంది.

The safety of the girls should be ensured

నే టి బాలికలే రేపటి తరానికి ఆశాజ్యోతులు, చదువ్ఞలో, పనిలో, తెలివిలో, ఇంటా బయటా ఆకాశంలో సగమంటూ వివిధ రంగాల్లో రాణిస్తున్న ఆడపిల్లలకు నేటికీ సమాజంలో అనేక ఆటంకాలు ఎదురవ్ఞతూనే ఉన్నాయి. చిన్న పిల్లలపై కూడా అఘాయిత్యాలు నానాటికీ పెరుగుతున్నాయి. చిన్న పిల్లలపై జరుగుతున్న లైంగిక దాడుల్లో తొంభైశాతం తెలిసిన వారే దాడి చేస్తున్నారు. లైంగిక దాడుల తర్వాత నేరం రుజువ్ఞ కాకుండా హత్యలు చేయడం మరింత గగుర్పాటుకు గురిచేసే అంశం.

ఇరుగుపొరుగు వారు, దగ్గరి బంధువ్ఞలు సంఘటనలకు కారకులైనప్పుడు పరువ్ఞకోసం పోలీసు స్టేషన్లో నమోదుకానీ ఉదంతాలు అనేకం. ఆడపిల్లలకు భద్రత కరవ్ఞతున్న నేపథ్యంలో ఆడపిల్ల పుట్టుకనే ఒక శాపంగా భావించే పరిస్థితి ఉంది. సమా జంలో ఉన్న పురుషాధిక్యత, ఆడపిల్లలపై వివక్ష, అసమానతలు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యలు, సామాజిక, ఆర్థిక కారణాలు, బాల్యవివాహాలు మొదలగు అంశాలు ఆడపిల్లల అభి వృద్ధికి ఆటంకంగా నిలుస్తున్నాయి. ఈ ధోరణి సమాజాభివృద్ధికి, మహిళా సాధికారతకు తీవ్ర విఘాతాన్ని కలిగిస్తున్నాయి. స్త్రీ శక్తివంతురాలైతే జాతి మొత్తం శక్తివంతమవ్ఞతుంది.

స్త్రీ లేకపోతే సృష్టి గమనం లేదు. స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు. అందుకే సృష్టికి మూలమైన ఆడపిల్లలను రక్షించుకోవాలి. వివిధ సంస్థల సర్వేల ప్రకారం దేశంలో ప్రతి సంవత్సరం కొన్ని వందల, వేల సంఖ్యలో పసికందులు, బాలికలు, యువతులు అదృశ్యమవ్ఞతు న్నారు. రోజురోజుకూ వరకట్న, గృహ హింసలు, అత్యాచారాలు మితిమీరిపోతున్నాయి. పసికందులను అపహరించి యాచక వృత్తిలోకి దింపడం, బాలికలను ప్రేమపేరుతో అపహరించడం, యువతులను అపహరించి వ్యభిచార గృహాలకు అమ్మడం, విదే శాలకు తరలించడం వంటివి చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆడజన్మ అంటే అతి ప్రమాదకరం అనే దుస్థితి ఏర్పడింది.

పేద రికానికి, ప్రేమ వ్యవహారాలకు ప్రతి సంవత్సరం కొన్నివేల మంది అబలలు బలి అవ్ఞతున్నారు. మన రాజ్యాంగం పురుషులతో సమానంగా మహిళలకు అన్ని విషయాలలో సమాన హక్కులు కల్పించడమే కాక స్త్రీ పురుష బేధం కారణంగా ఎటువంటి వివక్ష చూపరాదని కూడా పేర్కొంది. మహిళల హక్కులను పరిరక్షించేం దుకు సమానతను పెంపొందించేందుకు అనేక చట్టాలు కూడా చేశారు. ఎన్ని చట్టాలు తెచ్చుకున్నప్పటికీ మహిళల హోదాలో మార్పురావడం లేదు. పురుషాధిక్యత, పేదరికం, కులమత సంప్రదాయాలు కూడా స్త్రీల వెనుకబాటుతనానికి, స్త్రీ సామాజిక స్థాయి హీనస్థానంలో ఉండటానికి కారణంగా నిలుస్తున్నాయి.

సమాజంలో స్త్రీలు అనేక వివక్షతలకు, అన్యాయాలకు గురి అవ్ఞతున్నారు. దీనికంతటికి ప్రధాన కారణం వారిలో ఉన్న అవిద్యే. మనదేశంలో మహిళల అక్షరాస్యత రేటు తక్కువగా ఉన్నది. ముఖ్యంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో నివసించే బాలికల అక్షరాస్యత శాతం చాలా తక్కువగా ఉంది. విద్యా వంతురాలైన తల్లి తన పిల్లలకు సమాజంలో గౌరవ ప్రదమైన స్థానాన్ని పొందుటకు అవసరమైన శిక్షణ నిస్తుంది. కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తుంది

స్త్రీలకు తమ కాళ్లపై తాము నిలబడగలమన్న నమ్మకం ఉన్నప్పుడే వారిలో ఆత్మవిశ్వాసం కలుగుతుంది. అమ్మాయి చదువ్ఞ అత్తింటి వారికే లాభం అనే భావన, ఒకవేళ చదివిస్తే అంతకంటే పెద్ద చదువ్ఞలు చదివిన వరుడు దొరకడనే భావన కొంత మంది తల్లిదండ్రులలో ఉంది. భారీగా వరకట్నాలు ఇవ్వవలసి వస్తుందని తొందరగా పెళ్లిళ్లు చేస్తున్నారు. బాలురుకన్నా బాలికలలో మధ్యలో బడి మానివేసే వారి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది బాలికల విద్యకు పెద్ద ఆటంకం. ఆడపిల్లల పెంపకంలో కూడా తల్లిదండ్రులు వ్యత్యాసాన్ని చూపిస్తున్నారు.

ఇటీవలే నిర్వహించిన వార్షిక విద్యానివేదిక (అసర్‌) ప్రకారం బాలికలను ప్రభుత్వ పాఠశాలకు, బాలురును ప్రైవేట్‌ పాఠశాలకు పంపిస్తున్నారు. ఈ సర్వే ప్రకారం ఆరు నుండి ఎనిమిది ఏళ్ల వయసు పిల్లల్లో 61.1 శాతం ప్రాంతా ల్లో ఈ వ్యత్యాసం ఎక్కువగా ఉంది.కాబట్టి తల్లిదండ్రుల ఆలోచన విధానంలో మార్పు రావాలి. ఆడ, మగ తేడాలేకుండా పిల్లలను సమానంగా పెంచాలి. అవకాశాలు కల్పించినట్లయితే బాలికలు కూడా అన్ని రంగాల్లో అద్భుతం రాణించగలుగుతారు. ఆడపిల్లలు చదువ్ఞకునేందుకు ప్రభుత్వాలు అనుకూల పరిస్థితులను కల్పించా లి. ప్రతి మండలానికి ఒక బాలికల జూనియర్‌ కళాశాలను ఏర్పా టు చేయాలి.

బాలికల విద్య అవశ్యకత గురించి విస్తృతంగా ప్రచారం చేయాలి. బాలికలకు ఉచిత రవాణా, మెరుగైన హాస్టల్‌ సౌకర్యం కలిగించాలి. బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు, విశ్రాంతి గదులను కేటాయించాలి. బాలికల కొరకు ప్రత్యేక నవొదయ పాఠ శాలలు తెరవాలి. బడ్జెట్లో బాలికల విద్యకు ఎక్కువ నిధులు కేటా యించాలి. వృత్తి, సాంకేతిక విద్యలకు ప్రాధాన్యత కల్పించాలి. బాలికలలో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలి.

చాలా మంది బాలికలు పోషకాహార లోపంతో రక్తహీనతతో అనారోగ్యం పాలవ్ఞతున్నారు. వారందరికీ పౌష్టికాహారం అందేలా చూడాలి. ఓపెన్‌ స్కూల్‌, దూరవిద్య కార్యక్రమాలు మామూలు గ్రామీణ ప్రాంతాలకు కూడా అందు బాటులోకి రావాలి. లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించి ఆడపిల్ల అని తెలియగానే భ్రూణహత్యలు నేటికీ కొన్ని చోట్ల జరుగుతూనే ఉన్నాయి. భ్రూణహత్యలు నివారించాలి. లింగ నిర్ధారణ పరీక్షలు చేయకుండా కఠిన విధానాలు అవలంబించాలి. బాలబాలికల లింగ నిష్పత్తిలో వ్యత్యాసం ఎక్కువగా ఉంటుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆరు సంవత్సరాల పిల్లల్లో ప్రతి వెయ్యి మంది మగ పిల్లలకు 914 మంది మాత్రమే ఉన్నారు.

ఈ మధ్యలోనే ఆడపిల్లల పట్ల అవగాహన పెరగడంతో ఈ నిష్పత్తి క్రమంగా తగ్గడం సంతోషదాయకం. బేటీ బచావ్‌, బేటీ పడావ్‌ పథకం ద్వారా బాలికలను సంరక్షించడం, బాలికల సంఖ్యను పెంచడం, వారి చదువ్ఞను కొనసాగించేలా చేయడం వటి కార్యక్రమాలు చేపడుతున్నది. ఎపి, తెలంగాణాలోని బాలికందరు చదువ్ఞకుం టున్నారని ఇటీవలే నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. అదే విధంగా చాలా మంది టీనేజ్‌ బాలికలు చదువ్ఞ తర్వాతే పెళ్లి అని తమ అభిప్రాయాలను వెల్లడించారు.దోపిడీకి, హింసకు, అత్యాచా రానికి గురైన బాధితులకు సత్వర న్యాయం అందించి దోషులకు కఠిన శిక్షలు విధించాలి. బాలికల హక్కులను కాపాడాలి. సృష్టికి మూలమైన ఆడపిల్లలను పుట్టనిద్దాం. వారి బంగారు భవిష్యత్తుకు చేయూతనిద్దాం. ఆడపిల్లల పట్ల వివక్షతకు తావ్ఞలేకుండా ప్రతి ఒక్కరూ కృషి చేసినప్పుడే ఆడ,మగ వ్యత్యాసాలు సమసిపోయి ఆడపిల్ల అవనికి నిజమైన వెలుగు అవ్ఞతుంది.

– కందుకూరి భాస్కర్‌

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/