ప్రాజెక్టుల జలకళతో రైతన్నల్లో ఆనందం

తెలంగాణలో వ్యవసాయం తీరుతెన్ను

Agriculture trend in Telangana
Agriculture trend in Telangana

వ్యవసాయరంగాన్ని అభివృద్ధి పరచడానికి భారతదేశంలో గతంలో ఎన్నడూ ఎక్కడా జరగ నంత ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నకృషి మరువలేనిది.

కోట్లాది రూపాయల ఖర్చుతో ప్రాజెక్టులను నిర్మించి, రైతులకు ఉచితంగా సాగునీరు అందించడం వ్యవసాయానికి నాణ్యమైన 24 గంటల విద్యుత్‌ను ఇవ్వడం, సాగుకు కావాలసిన పెట్టుబడిని రైతుబంధు పేరుతో అందించడం,భూమిశిస్తు తీసుకోకుండా రైతులకు చేయూత ఇవ్వాలనే ఆలోచనతో అకారణంగా రైతు మరణించినా, కుటుంబానికి ఐదు లక్షల రూపాయల బీమా అందించడం, అనేక సదుపాయాలు కల్పించి రైతుపక్షపాతిగా నిలువడం, దేశంలోనే వ్యవసాయరంగంలో ఆధునికసాగు పద్ధతులు పాటించి, తెలంగాణ వాతావరణానికి అనుగుణంగా ఏ పంటలు పండుతాయో ప్రభుత్వమే ప్రచారంచేసింది.

మార్కె ట్లో అవసరాలను బట్టి అధ్యయనం చేయాలి. ప్రజలఆహారపు అలవాట్లలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సాగుచేయాలి. అందుకోసం వ్యవసాయశాఖ ప్రత్యేకక్యాంపులు ఏర్పాటు చేయ డంవలన ప్రభుత్వం ఆశించిన ఫలితాలు పొందవచ్చు.

దేశం లో దాదాపు 70 శాతం ప్రజలు వ్యవసాయ జీవనాధారంగా బతుకుతున్న క్రమంలో ఇప్పుడు ఉన్న పరిస్థితిలో వ్యవసాయ అభివృద్ధి కోసం ఇటీవల నీతి ఆయోగ్‌ పాలన మండలి ఐదువ సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి మోడీ ప్రసంగిస్తూ వ్యవ సాయంలో సంస్థాగత సంస్కరణలను సూచిస్తూ ఒక అత్యు న్నత స్థాయి టాక్స్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేయాలని నిర్ణయించడం శుభపరిణామమే.

దేశంలో ఆహార ధాన్యాల కొరత లేకుండా స్వయం సమృద్ధి సాధించాలంటే కేవలం ఆహారం కోసమే కాకుండా ప్రజలకు పౌష్టికాహారం అందించే ప్రయత్నమే వ్యవ సాయరంగంలో మార్పుస్పష్టంగా కనపడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం 1కోటి 20 లక్షల ఎకరాలు సాగు లోకి వచ్చింది.అనుకున్నదానికంటే ఎక్కువగానే సాగు చేసినప్ప టికీ వ్యవసాయ పంటలు ప్రకృతి వైపరీత్యాలకు వాతావరణం సహకరించక రైతులు కొంత మేరకు నష్టపోయే అవకాశం ఏర్ప డింది.

ఖరీఫ్‌ కాలంలో ఏకంగా 41 లక్షల ఎకరాల ఆయుకట్టు కు సాగునీటిని అందించాలనే సాకారం చరిత్రలోనే రికార్డు సాధించిందని చెప్పవచ్చు. తెలంగాణరాష్ట్రంలో ఖరీఫ్‌ సీజన్‌లో 23లక్షల ఎకరాలకు నీటినిఅందించి సాధారణంగా ప్రతి ఏడాది నీటి లభ్యతను బట్టి 10నుండి 20 లక్షల ఎకరాలు మాత్రమే నీటిని సరఫరా చేస్తూవచ్చారు. కానీ ఖరీఫ్‌, రబీ రెండు కలిపి కూడా 40లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని ఏ సంవత్సరం లో ఇచ్చిన సందర్భం లేదు.

రాష్ట్ర సాగునీటి సమీకృత నీటి నిర్వహణ ప్రణాళిక స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో ముందు చూపుతో ఆయకట్టుకు ఖరీఫ్‌ కాలంలో సాగునీటిని సరఫరా చేయాలని, ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం ప్రభు త్వం ఏకంగా 41 లక్షల ఎకరాలకు ఇవ్వాలని నిర్ణయించడం చారిత్రాత్మక నిర్ణయంగా భావించవచ్చు. అందుకు అనుగుణంగానే వాతావరణ పరిస్థితి అనుకూలించడం అన్ని ప్రాజెక్టులలోనీటి నిల్వలుండడం ప్రభుత్వం అనుకున్న లక్ష్యం చేరిందని భావించాలి.

ఏ ప్రభుత్వం కూడా ఖరీఫ్‌ మొదట్లో నీటిని విడుదల చేసిన దాఖలాలు లేవ్ఞ. తెలంగాణ ప్రభుత్వం ఈ సంవత్సరం విడుదల చేయడం ఇదే తొలిసారి. దేశంలో కాలానుగుణంగా వ్యవసాయపద్ధతిలో మార్పులు రావలసినటు వంటి అవసరం ఎంతైనా ఉంది. కాల్వల ద్వారా నీరు లేక మోటార్‌ బావ్ఞలపై ఆధారపడి సాగు చేసిన రైతన్నకు ఆధునిక డ్రిప్‌ ఇరిగేషన్‌ లేకుండా చేసే పరిస్థితి వచ్చిన మార్పు సంకేత మే ఆధునికపద్ధతులకు అలవాటు చేసుకున్నారనే భావించాలి.

ఎనకటికి ఎద్దులేని వ్యవసాయం ఉండేదేమో కానీ నేడు వ్యవ సాయ రైతుకు యంత్రం లేని పరిస్థితి లేదు.కొన్ని సందర్భాల్లో లేబర్‌ దొరకక, యంత్రాలు లేక, ఉత్పత్తులకు మార్కెట్‌లో ధరలు లేక, రైతు పంటను కోయలేక వదిలేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాలానుగుణంగా వ్యవసాయ రంగంలో విప్ల వాత్మక మార్పులు తీసుకురావాలసినటువంటి అవసరం ఎంతై నాఉంది.

అధిక దిగుబడులు సాధించాలంటే ఆధునిక పద్ధతుల అవశ్యకతతో పాటు శాస్త్రీయపద్ధతులతో ముందుకు వెళ్లినట్లయి తే వ్యవసాయదారులకు ఆశించిన ఫలితాలు లభిస్తాయి. రైతు ఒకేపంట ఎప్పటికీ వేయడంవల్ల కూడా దిగుబడితగ్గిపోతుంది.

కారణం ప్రతి సంవత్సరం పంట మార్పు చేయాల్సిన అవస రంఉంది. లాభాలే ప్రధానంగా పంటలు వేయడం వలన దిగు బడితగ్గడంతోపాటు భూమిలో ఉన్నసారం తగ్గేఅవకాశం ఉంది. ప్రధానంగా మార్పు కోసం ప్రయత్నం చేయాలి.

తెలంగాణ రాష్ట్రంలో ఆహార ధాన్యాల కొరత లేకుండా స్వయం సమృద్ధి సాధించాలంటే కేవలం ఆహారం కోసమే కాకుండా ప్రజలకు పౌష్టికాహారం అందించేపంటలపై దృష్టి పెట్టాలి.

-డాక్టర్‌ సంగని మల్లేశ్వర్‌, (రచయిత: విభాగాధిపతి, జర్నలిజం శాఖ)

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/