విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో సిబిఐ తనిఖీ

అధికారులకు చిక్కిన యూనియన్‌ నాయకుడు

Central Bureau of Investigation
Central Bureau of Investigation

విశాఖ: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సిబిఐ ఆకస్మిక తనిఖీలు చేసింది. ప్రముఖ గుర్తింపు యూనియన్ నాయకుడు మంత్రి మూర్తిని సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఓ నిరుద్యోగి నుంచి రూ. 2 లక్షలు డిమాండ్ చేశాడు. అలాగే స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి కొంతమంది దగ్గర లక్షలు కాజేసిన యూనియన్ నాయకుడు మంత్రి మూర్తి.. రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా అధికారులు పట్టుకున్నారు. అలాగే మూర్తి నివాసం, కార్యాలయంలో సిబిఐ అధికారులు సోదాలు జరిపారు. పూర్తి వివరాలు అందవలసి ఉంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/