ఆ నాలుగు రాష్ట్రాల ఫలితాలే కీలకం

జార్జియాలో ట్రంప్‌ ఆధిక్యం

Trump-Biden
Trump-Biden

Washington: అమెరికా అధ్యక్ష పీఠాన్ని నిర్దేశించనున్న పెన్సిల్‌ వేనియా, జార్జియా, నార్త్‌ కెరోలినా, నెవాడా రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు రావల్సి ఉంది..

ఈ నాలుగు రాష్ట్రాలు కలుపుకుని మొత్తం 57 ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్న సంగతి విదితమే..

తాజా ఫలితాలను బట్టి డెమోక్రాటిక్‌ అధ్యక్ష అభ్యర్థి బైడెన్‌ 264 ఎలక్టోరల్‌ ఓట్లతో పీఠాన్నిఅధిరోహించేందుకు చేరువలో ఉన్నారు..

కాగా ఈ నాలుగురాష్ట్రాల్లో ఏదో ఒక రాష్ట్రంలో ఆయన విజయం సాధించినా అధ్యక్ష పీఠం ఆయన వశం కానుంది..ఇదిలా ఉండగా, ప్రస్తుతం జార్జియాలో 90శాతం ఓట్ల లెక్కింపు పూర్తయిందని సమాచారం..

కాసేపట్లో పూర్తి ఫలితం వెలువడనుంది.. కాగా జార్జియాలో మాత్రం ట్రంప్‌ ప్రత్యర్ధి బైడెన్‌ కంటే 0.3శాతం ఓట్ల ఆధిక్యత కనబరుస్తున్నారు..

ఇక్కడ ట్రంప్‌ విజయావకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/