ఓటమి చెందినా….మరో 76రోజులు అధికారపగ్గాలు!

అప్పటిదాకా శ్వేతసౌధంలోనే నివాసం

Trump
Trump

Washington: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల తీరు గమనిస్తే చివరిదాకా ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది..

కాగా, ఈ ఎన్నికల్లో ట్రంప్‌ ఓటమి పాలైనప్పటికీ కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు 2021 జనవరి 20 దాకా పగ్గాలు చేపట్టలేరు..

దీంతో ఇంకా 76 రోజులు పాటు ట్రంప్‌ చేతిలోనే అధ్యక్ష పగ్టాలు ఉంటాయి.. ఈ నేపథ్యంలో ఆయన అధికార నివాసమైన శ్వేతసౌధంలోనే ఉంటారు..

ఆయన చేతిలోనే అన్ని అధికారాలు ఉంటాయి. ఇక 76 రోజుల్లో ట్రంప్‌ ఏం నిర్ణయాలు తీసుకుంటారో ఊహకు అతీతంగా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.

ఇక పలు విషయాల్లో ఆయన తన మార్క్‌ను చూపెడటం ఖాయం అని అంటున్నారు..

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/