వ్యాక్సిన్ తీసుకున్న నర్సు మృతి

మృతురాలు పిడియాట్రిక్ అసిస్టెంట్‌ నర్సు

The nurse died'

New Delhi: ఫైజర్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న రెండు రోజుల తర్వాత ఒక నర్సుమృతి చెందింది.

సోనియా అసేవెడో(41) అనే మహిళ పోర్టోలోని పోర్చుగీసు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అంకాలజీలో పిడియాట్రిక్ అసిస్టెంట్‌ నర్స్‌గా పని చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఫైజర్‌ అభివృద్ధి చేసిన కోవిడ్‌ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగంలో భాగంగా సోనియా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఆ తర్వాత రెండు రోజులకే ఆమె మృత్యువాత పడ్డారు. 

 ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండానే కరోనా వ్యాక్సిన్ తీసుకున్న రెండు రోజుల తరువాత ఆమె అనూహ్యంగా మరణించారు.  కాగా  పోర్చుగీసు ఆరోగ్య శాఖ అధికారులు సోనియా మృతికి గల కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

తాజా స్వస్థ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/