బిట్‌కాయిన్‌ భారీ పతనం

మరి కొద్ది రోజులు అస్పష్టంగానే ఉండవచ్చు : మార్కెట్‌ నిపుణుల అంచనా

Bitcoin's massive fall
Bitcoin’s massive fall

ముంబై: గత ఏడాది భారీగా పెరిగిన క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్‌ కొత్త సంవత్సరంలో పడిపోయింది. సోమవారం బిట్‌కాయిన్‌కు బ్లాక్‌ మండే. ఇంతకుముందు రికార్డు స్థాయిలో 34800డాలర్లకు అంటే రూ.25.4 లక్షలకు చేరుకున్న బిట్‌కాయిన్‌ తన గ్రౌండ్‌ ను కోల్పోయింది.

కొత్త ఏడాదిలో 33,670 డాలర్లపైకి చేరుకున్న బిట్‌కాయిన్‌ సోమవారం 14శాతం మేర పతనమైంది. ఆదివారం నమోదయిన 34800డాలర్లను పరిగణలోకి తీసుకుంటే 20శాతం పతనమైంది. అంతకు ముందు 9శాతం పతనమై 30,077 డాలర్ల వద్ద స్థిరపడింది.

2017లో అంతకంతకూ పెరుగుతున్న ఈ క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్‌ మూడు వారాల క్రితం డిసెంబరు 16న మొదటి సారి 20వేల డాలర్లకు చేరింది. ఆ తర్వాత రికార్డు స్థాయిలో దూసుకెళ్లింది.

గత ఏడాదితో పోలిస్తే బిట్‌ కాయిన్‌ విలువ నాలుగు రెట్లు పెరిగింది. అయితే సోమవారం అనూహ్యంగా 14శాతం పడిపోయింది. బిట్‌కాయిన్‌ మరి కొద్ది రోజులు అస్పష్టంగానే ఉండవచ్చునని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

వర్చువల్‌ కరెన్సీ బిట్‌కాయిన్‌ 2020 కేలం డర్‌ ఏడా దిలో జంప్‌ చేసి న విషయం విదితమే. డిసెంబర్‌ చివరి వారంలో అంత కంతకూ పెరిగింది. డిసెం బరు 25న 25వేల డాలర్లు పలికిన బిట్‌కాయిన్‌, ఆ తర్వాత రోజు 26వేలు, 27న 27వేల డాలర్లుగా నమోదయింది.

గత మార్చి నెలలో 5000డాలర్లు పలికిన బిట్‌ కాయిన్‌ ఇప్పుడు 30వేలపైకి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా బిట్‌కాయిన్‌ మార్కెట్‌ విలువ 50వేల కోట్ల డాలర్ల వరకు ఉంది. గత కొంతకాలంగా బిట్‌ కాయిన్స్‌ మంచి లాభాలను అంది స్తోంది.

ఈ క్రిప్టో కరెన్సీ కొనుగోలుకు అందరూ ఆసక్తిచూపు తున్నారు. ఒక దశలో 1500డాలర్ల స్థాయికి పడిపోయిన బిట్‌కాయిన్‌ విలువ ఇప్పుడు 30వేల డాలర్లమార్క్‌కు చేరువలో ఉంది. త్వరలో 35వేల డాలర్లకు చేరుకోనుందని, ఈ క్రిపోకరెన్సీ విలువ 2030 నాటికి రూ.కోటికి చేరుకునే అవ కాశాలు ఉంటాయని అంచనా వేస్తు న్నారు.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/