బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కు ఊరట

బోధన్ మాజీ బిఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్‌ కు తెలంగాణ హైకోర్టు భారీ ఊరటను కల్పించింది. కొద్దీ రోజుల క్రితం షకీల్ కుమారుడు ప్రజా భవన్ వద్ద రోడ్డు ప్రమాదం చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును శుక్రవారం నాడు తెలంగాణ హైకోర్టు విచారించింది.

ఈ కేసులో షకీల్‌ను అరెస్టు చేయవద్దని , షకీల్‌పై లుక్ అవుట్ నోటీసును సస్పెండ్ చేస్తూ పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. ఈనెల 23వ తేదీన పోలీసుల ఎదుట హాజరు కావాలని , పోలీసుల విచారణకు సహకరించాలని షకీల్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.