గోవాలో ఎంజాయ్ చేస్తా అంటున్న మల్లారెడ్డి

minister-mallareddy

మాజీ మంత్రి , బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. నిత్యం ఏదొక వార్త తో మీడియా లో హైలైట్ అవుతుంటారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి ఆయన్ను హైలైట్ చేస్తున్నాయి.

తనకు గోవాలో హోటల్ ఉందని.. రాజకీయాల నుంచి తప్పుకున్న వెంటనే అక్కడకు వెళ్లి ఎంజాయ్ చేస్తానని చెప్పుకొచ్చారు. అలాగే కేసీఆర్ కుటుంబంలో మాదిరి మా ఇంట్లోనూ ముగ్గురికి పదవులు ఉండాలని కోరుకుంటున్నా.. అందులో భాగంగానే నా కుమారుడు భద్రారెడ్డిని ఈ సారి ఎంపీ ఎన్నికల బరిలో నిలుపుతున్నానని తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశిస్తే మల్కాజ్‌గిరి పార్లమెంట్ నుంచి నా కుమారుడు భద్రారెడ్డి పోటీ చేస్తారని మల్లారెడ్డి ప్రకటించారు.

అలాగే చేవెళ్ల కాంగ్రెస్ టికెట్ కోసం సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కర్చీఫ్ వేశారని ..ఇది తెలిసి పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారని అన్నారు. కేవలం చేవెళ్ల ఎంపీ టికెట్ కోసమే పట్నం మహేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారని చెప్పుకొచ్చారు.