టాస్ గెలిచిన న్యూజిలాండ్.. భారత్ ఫీల్డింగ్

ఆక్లాండ్: న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా రెండో టీ20 మ్యాచ్‌లో అతిథ్య జట్టుతో తలపడుతోంది. ఆక్లాండ్ లోని ఈడెన్ పార్క్ మైదానంలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. రెండో టీ20లో టీమిండియాలో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, దుబే, మనీశ్ పాండే, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, ఛాహల్, షమీ, బుమ్రా ఉన్నారు. ఇటీవల ఇదే మైదానంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చేసిన విషయం తెలిసిందే. మొదటి మ్యాచ్‌లో టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్ 29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులతో 58 పరుగులు చేసి అజేయంగా నిలిచి, టీమిండియాను గెలిపించిన విషయం తెలిసిందే.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/