హిమాచల్‌ప్రదేశ్ లో రేపటి నుంచి లాక్‌డౌన్

ప్రభుత్వం ఆదేశాలు జారీ

Lockdown in Himachal Pradesh from tomorrow
Lockdown in Himachal Pradesh from tomorrow

Shimla: హిమాచల్‌ప్రదేశ్ లో కరోనా కేసుల కారణంగా 10 రోజులపాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈనెల 7వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అమలులో ఉంటుందని పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలను మూసివేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుందని , పదో తరగతి పరీక్షలు ఇప్పటికే రద్దు చేయడంతో ఈ నెల 31 వరకు విద్యాసంస్థలను మూసివేయాలన్న ఆదేశాలను ప్రభుత్వం జారీ చేసింది.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/