ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్

లోక్‌సభ రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా

Nirmala Sitharaman
Nirmala Sitharaman

న్యూఢిల్లీ: ఈరోజు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. రేపు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆమె లోక్‌సభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు అంచనా 6 నుంచి 6.5 శాతం మధ్య ఉందని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక పరిస్థితులను ఈ సర్వేలో పొందుపర్చారు. సర్వేలోని పూర్తి వివరాలు కాసేపట్లో మీడియాకు అందనున్నాయి. అనంతరం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సభను రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా వేశారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/