ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కు కరోనా పాజిటివ్

స్వయంగా వెల్లడి

MLA Prakash Goud
MLA Prakash Goud

Hyderabad: తెలంగాణలో మరో ప్రజాప్రతినిథి కరోనా బారిన పడ్డారు. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కు కరోనా సోకింది. కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్న ఆయనకు పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.

ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం తాను కరోనాకు చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పిన ఆయన ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/