తెలుగు మత్స్యకారుల విడుదల చేయనున్న పాక్‌

fishermen
fishermen

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌ జైల్లో ఉన్నా తెలుగు మత్స్యకారులకు విముక్తి లభించనుంది. వారిని విడుదల చేసేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ మేరకు భారత విదేశాంగశాఖకు అక్కడి ప్రభుత్వం సమాచారం అందించింది. తాము విడుదల చేయబోతున్న మత్స్యకారుల జాబితాను పంపించింది. జనవరి 6న వాఘా సరిహద్దు వద్ద 20 మంది మత్స్యకారులను భారత అధికారులకు అప్పగించనుంది. చేపల వేట కోసం గుజరాత్‌కు వలస వెళ్లిన మత్స్యకారులు 2018 నవంబరులో అనుకోకుండా పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించారు. దాంతో పాకిస్తాన్ నౌకాదళం వారిని అదుపులోకి తీసుకుంది. ఇక 2008 ఒప్పందం ప్రకారం ప్రతి ఏటా జనవరి 1, జులై 1న ఇరుదేశాలు ఖైదీలను విడుదల చేస్తాయి. ఈ నేపథ్యంలో జనవరి 6న భారత్.. 267 మంది ఖైదీలు, 99 మంది మత్స్యకారులను విడుదల చేయనుంది. ఇక పాకిస్తాన్… 55 ఖైదీలు, 227 మంది మత్స్యకారులను విడుదల చేయనుంది.

మత్స్యకారుల జాబితా ఇదే..


ఎస్‌.కిశోర్‌ S/o అప్పారావు
నికరందాస్‌ ధనరాజ్ S/o అప్పన్న
గరమత్తిS/o రాముడు

ఎం. రాంబాబు S/o సన్యాసిరావుఎస్‌.

అప్పారావుS/o రాములు

జి. రామారావుS/o అప్పన్న

బాడి అప్పన్న S/o అప్పారావు
ఎం. గురువులు S/o సతియా

నక్కా అప్పన్న S/o లక్ష్మయ్య

నక్కా నర్సింగ్ S/o లక్ష్మణ్‌

భైరవుడు S/o కొర్లయ్య

వి. శామ్యూల్ S/oకన్నాలు

కె.ఎర్రయ్య S/o లక్ష్మణరావు

డి. సురాయి నారాయణన్ S/o అప్పలస్వామి

కందా మణి S/o అప్పారావు

కోరాడ వెంకటేష్ S/o నర్సింహులు

సుమంత్‌ S/o ప్రదీప్

శేరాడ కళ్యాణ్S/o అప్పారావు

కేశం రాజు S/o అమ్మోరు

సన్యాసిరావు S/o మీసేను


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/