తెలంగాణ అంటే టిఆర్‌ఎస్‌

చీకోడ్‌ గ్రామం పల్లెప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న హరీష్‌రావు

T. Harish Rao
T. Harish Rao

సిద్దిపేట: దుబ్బాక నియోజకవర్గం చీకోడ్‌లో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రి హరీష్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్‌, బిజెపి, టిడిపి నూకలు చెల్లాయని హరీష్‌ రావు అన్నారు. తెలంగాణ అంటే..టిఆర్‌ఎస్‌, టిఆర్‌ఎస్‌ అంటే కెసిఆర్‌ అని మంత్రి వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వమని అన్నారు. మున్సిపల్‌ ఎన్నికలు వస్తే ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నాయని హరీష్‌ రావు విపక్షాలను ఎద్దేవా చేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి కోర్టుకు వెళ్లి వాయిదా వేయాలని కోరుతున్నారని విమర్శించారు. ఆ పార్టీలు ఎన్నికల్లో తమతో పోటీ పడటానికి భయపడుతున్నాయని హరీష్‌ రావు అన్నారు. ఆర్థిక మాంద్యం ఉన్నా..సీఎం కెసిఆర్‌ సంక్షేమ పథకాల కార్యక్రమంలో భాగంగా ఆసరా రూ.2016 పింఛను ఇస్తున్నారని, అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని మంత్రి తెలిపారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చయండి:https://www.vaartha.com/andhra-pradesh/