తెలంగాణ ఇసుక విధానాన్ని కేంద్రం గుర్తించింది

K. T. Rama Rao
K. T. Rama Rao

హైదరాబాద్‌: తెలంగాణ ఇసుక విధానాన్ని ఉత్తమమైనదిగా కేంద్రం గుర్తించిందని మంత్రి కెటిఆర్ తెలిపారు. శుక్రవారం ఆయన ట్విట్టర్‌లో తెలంగాణ బిజెపి నాయకులపై మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలు కూడా తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాలని కేంద్రం సూచించినట్టు గుర్తు చేశారు. తెలంగాణ అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తుంటే రాష్ట్ర బిజెపి నాయకత్వానికి ఇవేమీ కనిపించడంలేదని మండిపడ్డారు. ఆధారంలేని, అనాగరికమైన విమర్శలు బిజెపి నేతలు చేస్తున్నారని, ఇప్పటికైనా బిజెపి నేతల్లో మార్పు రావాలని సూచించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/