ఉత్తమ ఫుట్‌బాల్‌ జట్టు బెల్జియం

‘ఫిఫా’ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో వరుసగా మూడోసారి టాప్‌ ర్యాంక్‌

The best football team is Belgium
The best football team is Belgium

మాడ్రిడ్‌ : ఫీఫా టీమ్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా బెల్జియం జట్టు ఎంపికైంది. గురువారం ఫిఫా విడుదల చేసిన ప్రపంచ ర్యాంకింగ్స్‌లో బెల్జియం వరుసగా మూడోసారి టాప్‌ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. కాగా ప్రపంచ చాంపియన్‌ ఫ్రాన్స్‌ రెండో స్థానంలో నిలవగా, మరో మేటి జట్టు మూడో ర్యాంక్‌ను దక్కించుకుంది.

గత దశాబ్దకాలంలో బెల్జియం పలు అంతర్జాతీయ పోటీలలో గెలిచి ఉత్తమ జట్టుగా నిలిచింది. కాగా ఇంగ్లండ్‌ 4, పోర్చుగల్‌ 5వ ర్యాంక్‌లలో నిలిచాయి. ఈ యేడాదిలో కరోనా కారణంగా కేవలం 352 అంతర్జాతీయ మ్యాచ్‌లు మాత్రమే సాధ్యమయ్యాయి.

గత ఏడాది 1,082 మ్యాచ్‌ల సంఖ్యతో పోల్చుకుంటే ఈ ఏడాది నిర్వహించిన మ్యాచ్‌లు చాలా తక్కువ. బెల్జియం ఈ యేడాది ఎనిమిది అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఆరింటిలో గెలుపొంది వచ్చే యేడాది యూఫా నేషన్స్‌ లీగ్‌ ఫైనల్స్‌కు అర్హత సాధించింది.

కాగా హంగరీ అత్యంత మెరుగుపడిన జట్టుగా నిలిచింది. ఈ యేడాది ఆ జట్టు 44 పాయింట్లు సాధించి 12 స్థానాలు మెరుగై టాప్‌ 50లో చోటు దక్కించుకుంది. ఆసియా ఖండంలో జపాన్‌ అత్యుత్తమంగా 27వ ర్యాంకును సాధించగా, ఇరాన్‌ 29, దక్షిణ కొరియా 38, ఆస్ట్రేలియా 41వ ర్యాంకులలో నిలిచాయి.

వచ్చే యేడాది ప్రపంచకప్‌ క్వాలిఫయింగ్‌ పోటీలు జరుగనున్నాయి. ప్రపంచకప్‌ 2022లో ఖతార్‌లో జరుగనున్నది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/