రష్యా టెన్నిస్‌ స్టార్‌ షరపోవా భావోద్వేగం

Maria Sharapova
Maria Sharapova

మాస్కో: రష్యా టెన్నిస్‌ స్టార్‌ ప్లేయర్‌ మరియా షరపోవా సంచలన నిర్ణయం తీసుకుని..యావత్ క్రీడాలోకాన్ని విస్మయపరిచింది. ప్రొఫెషనల్ టెన్నిస్‌ నుంచి తప్పుకుంటున్నట్టు ఈ 32 ఏళ్ల టెన్నిస్టార్ బుధవారం ప్రకటించింది. ఇకపై కోర్టులో అడుగుపెట్టడం లేదని వానిటీఫెయిర్‌ వెబ్‌సైట్‌కు తెలిపింది. తీవ్రమైన భుజం నొప్పితోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఐదు సార్లు గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచిన ఆమె తన రిటైర్మెంట్‌ గురించి ప్రకటిస్తూ భావోద్వేగానికి గురైంది. ఖతెలిసిన ఒకే ఒక జీవితాన్ని ఎలా వదులుకోవాలి? చిన్నప్పటి నుంచి ఆడుతున్న టెన్నిస్ కోర్టులను విడిచి వెళ్లడం ఎలా? టెన్నిస్.. చెప్పుకోలేని దుఃఖాలు, మాటల్లో వర్ణించలేని ఆనందాలు ఇచ్చింది. ఈ ఆట నాకో కుటుంబాన్ని ఇచ్చింది. 28 ఏళ్ల పాటు వెన్నంటి నడిచిన అభిమానులను అందించింది. ఈ ఆటను ఎలా వదిలి వెళ్లాలి. ఇది చాలా బాధాకరం. టెన్నిస్.. ఇక గుడ్‌బై’ అని షరపోవా భావోద్వేగం చెందింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/