నాగ చైతన్య ‘థాంక్యూ’ టీజర్‌ విడుదల

వరుస హిట్ల తో ఫుల్ జోష్ లో ఉన్న నాగ చైతన్య..ప్రస్తుతం ‘థాంక్యూ’ మూవీ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విక్రమ్ కె కుమార్ డైరెక్షన్లో దిల్ రాజు బ్యానర్ లో ఈ మూవీ తెరకెక్కింది. విభిన్నమైన ప్రేమకథా చిత్రంగా రాబోతున్న ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. కాగా చిత్ర ప్రమోషన్లో భాగంగా ఫస్ట్ లుక్ టీజర్ ను రిలీజ్ చేసి సినిమా ఫై ఆసక్తి నింపారు.

సినిమాలో చైతూ జర్నీని టీజర్ లో చూపించారు. విదేశాలకి వెళ్లిన తరువాత ఆయనకు ఎదురైన అనుభవాల నేపథ్యంలో ఈ కథ నడవనున్నట్టు తెలుస్తోంది. ఒక్కో దశలో ఒక్కో హీరోయిన్ తో ఆయన ప్రయాణం కొనసాగుతుందనే విషయాన్ని చూపించారు. ఆ జాబితాలో రాశి ఖన్నా .. అవికా .. మాళవిక నాయర్ కనిపిస్తున్నారు. ‘లైఫ్ లో కాంప్రమైజ్ అయ్యేదే లేదు .. ఎన్నో వదులుకుని ఇక్కడికి వచ్చాను’ అనే చైతూ డైలాగ్ ను బట్టి చూస్తే, సీరియస్ గా ఆయనకి ఏదో గోల్ ఉన్నట్టుగా అర్థమవుతోంది. లవ్ .. రొమాన్స్ .. ఎమోషన్ .. యాక్షన్ కి సంబంధించిన సీన్స్ పై కట్ చేసిన టీజర్ ఆసక్తిని నింపేశారు. జులై 08 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ లోపు మీరు ఈ టీజర్ ఫై లుక్ వెయ్యండి.