తెలుగు ఇండస్ట్రీ కి ఇప్పటికీ, ఎప్పటికీ చిరంజీవి మాత్రమే పెద్దదిక్కు- ప్రకాష్ రాజ్

తెలుగు ఇండస్ట్రీ కి ఇప్పటికీ, ఎప్పటికీ చిరంజీవి మాత్రమే పెద్దదిక్కు- ప్రకాష్ రాజ్

టాలీవుడ్ చిత్రసీమ లో ‘మా’ ఎన్నికలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంది. ప్రకాష్ రాజ్ , విష్ణు ప్యానల్ మధ్య పోటీ నెలకొని ఉంది. దీంతో ఇరు ప్యానల్ సభ్యులు ఒకరి ఫై ఒకరు పోటాపోటీగా విమర్శలు , ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. రీసెంట్ గా మోహన్ బాబు ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ప్రస్తుతం చిరంజీవి ఇండస్ట్రీ కి పెద్ద దిక్కు గా ఇండస్ట్రీ కష్టాల ఫై పోరాడుతున్నాడని సదరు ఛానల్ హోస్ట్ అనగా..మోహన్ బాబు వెంటనే ఇండస్ట్రీ కి ప్రస్తుతం పెద్ద దిక్కు అంటూ ఎవరు లేరని , ఆ అర్హత ఎవరికీ లేదంటూ చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ ఫై ప్రకాష్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికీ, ఎప్పటికీ చిరంజీవి మాత్రమే పెద్దదిక్కు అని.. ఆయన కాకుండా మరెవరూ లేరు అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీగా నిలిచిన ప్రకాశ్‌ రాజ్ ను చిరంజీవి ప్రమోట్ చేస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు మంచు విష్ణుకు బాలకృష్ణ, కృష్ణంరాజు సహా ఇండస్ట్రీలో మరికొందరు పెద్ద హీరోలు అండగా నిలిచారు. కానీ చిరంజీవి మాత్రం ప్రకాశ్‌ రాజ్ వైపు ఉన్నట్లు తెలుస్తోంది. చిరంజీవి మాత్రమే అని ప్రకాశ్ రాజ్‌ చేసిన కామెంట్స్ కొందరికి నచ్చడం లేదు. ఇది కూడా కాంట్రవర్సీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మరి దీనిపై ప్రకాశ్‌ రాజ్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. మరోవైపు తాను అధ్యక్షుడిగా గెలిచిన వెంటనే మంచు విష్ణుకు ఫోన్ చేస్తాను అని.. బిల్డింగ్ కట్టడానికి సహాయం అడుగుతాను అంటున్నాడు ప్రకాశ్ రాజ్‌.