అమెరికాలో 1000 మల్టీప్లెక్స్ లలో ఆర్ఆర్ఆర్ రిలీజ్

ఆర్ఆర్ఆర్ మూవీ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. డైరెక్టర్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మాకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తుండగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించబోతున్నాడు. జనవరి 07 న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. ఈ తరుణంలో చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లోను భారీగా రిలీజ్ చేయబోతున్నారు.

అమెరికాలోనే 1000 మల్టీప్లెక్స్​ల్లో సినిమా రిలీజ్​ చేయడమే లక్ష్యంగా చిత్ర యూనిట్​ పనిచేస్తున్నట్లు సమాచారం. సరిగమ సినిమా, రఫ్టర్​ క్రియేషన్స్ ఈ సినిమాను​ అమెరికాలో పంపిణీ చేస్తున్నాయి. సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య నిర్మించారు. కీరవాణి స్వరాలు అందించారు. ఆలియాభట్‌, ఒలీవియా మోరీస్‌ కథానాయికలు. శ్రియ, సముద్రఖని, అజయ్‌ దేవ్‌గణ్‌ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.