ఎదురుకాల్పులు..ఇద్దరు ఉగ్రవాదుల హతం

encounter

శ్రీనగర్‌: జ‌మ్ముక‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదులు, భ‌ద్ర‌తాద‌ళాల మ‌ధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. శ్రీన‌గ‌ర్ శివార్ల‌లోని ర‌ణ్‌బీర్‌గ‌ఢ్‌లో ఉగ్ర‌వాదులు ఉన్నార‌నే విశ్వ‌స‌నీయ స‌మాచారంతో భ‌ద్ర‌త ద‌ళాలు, సీఆర్పీఎఫ్ బ‌ల‌గాలు, జ‌మ్ముక‌శ్మీర్ స్పెష‌ల్ ఆప‌రేష‌న్ గ్రూప్ పోలీసులు సంయుక్తంగా శ‌నివారం తెల్ల‌వారుజామున గాలింపు చేప‌ట్టాయి. అయితే భ‌ద్ర‌తా ద‌ళాల‌పై ఉగ్ర‌వాదులు ఒక్క‌సారిగా గుండ్ల వ‌ర్షం కురిపించార‌ని, దీంతో ఎదురుకాల్పుల్లో ఒక గుర్తుతెలియ‌ని ఉగ్ర‌వాది హ‌త‌మ‌య్యాడ‌ని క‌శ్మీర్ జోన్ పోలీసులు పేర్కొన్నారు. మ‌రో ఇద్ద‌రి నుంచి ముగ్గురు ఉగ్ర‌వాదులు ఆ ప్రాంతంలో ఉన్నార‌ని, వారికోసం గాలింపు కొన‌సాగుతున్న‌ద‌ని వెల్ల‌డించారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/