KPHB మెట్రో స్టేషన్ వద్ద భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్ లోని KPHB మెట్రో స్టేషన్ వద్ద భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి మెట్రో స్టేషన్​ దగ్గరున్న ఓ ఫర్నిచర్​ దుకాణంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ షర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.

అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది..ఘటన స్థలానికి నాలుగు ఫైరింజన్లతో చేరుకుని మంటలు ఆర్పివేయడానికి ట్రై చేస్తున్నారు. మూడు అంతస్తుల్లో మంటలు ఎగిసి పడుతుండటంతో సమీపంలోని మరో మూడు దుకాణాలకు వ్యాపించాయి. దాదాపు రూ.40 లక్షల మేరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తుంది.