ముస్లిం మహిళల గౌరవాన్ని కాపాడాము: ప్రధాని

ముస్లిం మహిళలపై అణచివేత ఉండకూడదంటే.. అధికారంలో బీజేపీ ఉండాల్సిందే.. మోడీ

YouTube video
PM Shri Narendra Modi addresses Vishal Jansabha in Saharanpur, Uttar Pradesh


సహరాన్ పూర్: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని సహరాన్ పూర్ లో జ‌రిగిన ఎన్నిక‌ల బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌ధాని మోడీ మాట్లాడారు.ముస్లిం మహిళల గౌరవాన్ని కాపాడేందుకు బీజేపీ ప్రభుత్వం ట్రిపుల్ తలాఖ్ ను నిషేధించిన విషయాన్ని గుర్తు చేశారు. ముస్లిం మహిళల అభివృద్ధి, హక్కులను అడ్డుకునేందుకు కొత్త మార్గాలను వెతుక్కుంటున్నారని ప్రతిపక్షాలను విమర్శించారు. యూపీలో ముస్లిం మహిళలు అణచివేతకు గురికాకూడదని కోరుకుంటే బీజేపీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఉండడం అవసరమన్నారు.

‘‘ ముస్లిం మహిళలను ట్రిపుల్ తలాఖ్ నుంచి బేజేపీ కాపాడింది. ఇప్పుడు ముస్లిం మహిళలు స్వేచ్ఛగా బీజేపీ ని సమర్థిస్తున్నారు. దీంతో ప్రత్యర్థుల కడుపు మండుతోంది. కానీ, ప్రతి ముస్లిం మహిళకు మేము మద్దతుగా ఉంటాము’’అని ప్రకటించారు. యూపీలో తొలి దశ ఎన్నికలకు పోలింగ్ జరుగుతున్న రోజే ప్రధాని కీలక అంశంపై మాట్లాడడం గమనార్హం. ‘‘ప్రతిపక్షాల వారసత్వ రాజకీయాలను ప్రధాని తన ప్రసంగంలో విమర్శించారు. కరోనా మహమ్మారి సమయంలో వారు గనుక అధికారంలో ఉండి ఉంటే టీకాలు మీకు చేరేవి కావు. ఎక్కడో అక్కడ అమ్మేసుకునేవారు. పేదలు గూడు పొందాలనుకుంటే, రూ.5 లక్షల వరకు ఆస్పత్రుల్లో ఉచిత చికిత్స పొందాలనుకుంటే యూపీలో బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలి’’అని పేర్కొన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/