మధ్యాహ్నం 3 గంటల వరకు 59.92 శాతం పోలింగ్ నమోదు..

munugode-bypoll-live-updates

హైదరాబాద్ః మునుగోడు బైపోల్ పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు 59.92 శాతం పోలింగ్ నమోదయ్యింది. ఓటు వేసేందుకు మరో మూడు గంటల సమయం ఉంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 5గంటల వరకు క్యూ లైన్లో ఉన్నవారిని పోలింగ్ కు అనుమతిస్తారు.

కాగా, మునుగోడు ఎన్నికల్లో మొదటిసారి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు యంగ్ ఓటర్లు.. అత్యంత కీలకమైన ఈ ఎన్నికలో ఓటేసేందుకు యువ ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు వస్తున్నారు.. కొత్తగా ఓటు హక్కు పొందిన యువతి, యువకులు తొలిసారి ఓటేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.. ఇతర వయస్సుల వారితో పోలిస్తే యువకులు ఓటు వేసేందుకు పోటీ పడుతున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/business/