సూర్యాపేట చివ్వెంలలో బండి సంజయ్ పర్యటనలో ఉద్రిక్త పరిస్థితి

ధాన్యం కొనుగోళ్ల పరిశీలన కోసం బండి సంజయ్ చేపట్టిన యాత్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య కొనసాగుతుంది. సోమవారం మిర్యాలగూడ లో సంజయ్ కాన్వాయ్ ఫై రాళ్ల దాడి జరిపారు. ఈ దాడిలో పలువురికి గాయాలు కాగా… నేరేడుచర్లలో వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. పరస్పర నినాదాలు, కోడిగుడ్లు, రాళ్లు రువ్వుకోవడంతో పరిస్థితి విధ్వంసకరంగా మారింది. సోమవారం రాత్రి బండి సంజయ్‌ సూర్యాపేట చేరుకునే వరకూ నిరసనలు ఆగలేదు. పెన్ పహాడ్ మండలం అనంతారం, అనాజ్ పూర్ మీదుగా సూర్యాపేట వెళ్తుండగా… అడుగడుగునా తెరాస కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈరోజు కూడా అదే పరిస్థితి ఏర్పడింది.

సూర్యాపేట జిల్లా చివ్వెంలలో బండి సంజయ్‌ను అడ్డుకునేందుకు తెరాస శ్రేణులు తరలివచ్చారు. బండి సంజయ్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తెరాస వర్గీయులకు పోటీగా భాజపా శ్రేణులు నినాదాలు చేస్తున్నారు. బిజెపి కార్య కర్తలను తెరాస శ్రేణులు కర్రలతో దాడి చేస్తూ వారిని తరిమికొట్టారు. నల్ల జెండాలతో తెరాస కార్యకర్తలు నిరసనలు తెలిపారు. బిజెపి – తెరాస కార్యకర్తల మధ్య రాళ్ల దాడులు , చెప్పులు విసురుకోవడం వంటివి చేసారు. ఏ క్షణం ఏంజరుగుతుందో అని అంత భయపడుతున్నారు.