దసరా బరిలో భవదీయుడు భగత్ సింగ్ ..?

వకీల్ సాబ్ మూవీ తో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న పవన్..ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఓ మూవీ సెట్స్ ఫై ఉండగానే మరో మూవీ ని ప్రకటిస్తున్నాడు. భీమ్లా నాయక్ , హరిహర వీరమల్లు చిత్రాలు సెట్స్ ఫై ఉండగానే..హరీష్ శంకర్ డైరెక్షన్లో భవదీయుడు భగత్ సింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ప్రస్తుతం ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీని వచ్చే ఏడాది దసరా సందర్భంగా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పండగ సీజన్లో పెద్ద సినిమాల హడావుడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీలైనంత త్వరగా ముందుగానే ఒక రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంటే బాగుంటుంది అని దర్శకుడు హరీష్ శంకర్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. 2022 అక్టోబర్ 5వ తేదీన భగత్ సింగ్ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేసినట్లు సమాచారం.

పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కలయికలో గబ్బర్ సింగ్ మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలియంది కాదు. అభిమానులు ఎలా అయితే పవన్ కళ్యాణ్ ను చూడాలనుకున్నారో ..ఆలా చూపించి హరీష్ అభిమానులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు కూడా పవన్ ఇమేజ్ కు తగ్గట్లు సినిమా తెరకెక్కించాలని అభిమానులు కోరుకుంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ మ్యూజిక్ అందిస్తుండగా..పూజా హగ్దే హీరోయిన్.