ఫేక్ ప్రచారం ఫై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం..

kishan-reddy

జనసేన పార్టీ వల్లే తెలంగాణ లో బిజెపి ఓటమి చెందిందని తాను అన్నంటూ సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని అన్నారు కిషన్ రెడ్డి. కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు పార్టీల మధ్య పొత్తు అనేది ఒకరిద్దరు తీసుకున్న నిర్ణయం కాదని… ఇరు పార్టీలు ఎంతో ఆలోచించి తీసుకున్న నిర్ణయమని చెప్పారు. ఇలాంటి వార్తలు నమ్మొద్దని… ఉద్దేశ పూర్వకంగా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన 8 స్థానాల్లోనూ ఓడిపోయింది. ఇక బిజెపి కేవలం 8 స్థానాల్లోనే విజయం సాధించింది. తెలంగాణలో బీజేపీ ఓటమికి జనసేన కారణమని , జనసేన వల్లే బీజేపీ ఇంతటి ఘోర పరాజయాన్ని మూటకట్టుకుందని కిషన్ రెడ్డి అన్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పవన్ ను నమ్ముకుని గ్రేట్ హైదరాబాద్ పరిధిలో నష్టపోయామని… పొత్తు లేకపోతే గ్రేటర్ లో మరో 4 నుంచి 5 సీట్లు వచ్చేవని కిషన్ రెడ్డి అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఏమాత్రం నిజం లేదని తెలిపారు.