ఏపీలో మొదలైన ఉష్ణోగ్రతలు..39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

temperature
temperature

అమరావతి : ఏపీలో వేసవి తాపం మొదలైంది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. రాయలసీమలో ఉదయం ఏడు గంటల నుంచే సూర్యుని వేడి మొదలవుతుండగా, రాత్రి 8 గంటలైనా అది తగ్గడం లేదు. దైనివల్ల ప్రజలు అంతో ఇబంది పడుతున్నారు. రాష్టంలో గరిష్ఠంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో 34 డిగ్రీల వరకు చేరింది. ఉత్తర కోస్తాలో మాత్రం సాధారణం కంటే అధికంగా ఉంది అని వాతావరణశాఖ పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల్లో ఉష్ణోగ్రతల ప్రభావం అధికంగా ఉంటుందని తెలిపింది. అలాగే, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సాధారణంగా, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, కడప, చింతూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది.

కడపలో ప్రసుతం సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ ఈ నెల 14, 15 తేదీలూ తేదీల్లో 42 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తిరుపతి, నెల్లూరు అనంతపురం, ఒంగోలు తదితర ప్రాంతాల్లో 33 డిగ్రీల నుంచి 38.3 డిగ్రీల మధ్య నమోదవుతాయని అంచనా వేసింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/