వరంగల్ జిల్లా గంజాయిని పట్టుకున్న పోలీసులు

Ganjai
Ganjai

వరంగల్: కేససముద్రం మండలం కల్వల శివారు ఆలేరు రోడ్డులో బైక్ పై తరలిస్తున్న రూ.2 .55 లక్షల విలువైన 17 కిలోల ఎండు గంజాయిని పట్టుకున్నట్లు రూరల్‌ సీఐ ఎస్‌.రవికుమార్‌ తెలిపారు. ఈ విషయాన్ని కేససముద్రం పోలీసుస్టేషన్లలో విలేకరుల సమావేశంలో రూరల్ సీఐ చెప్పారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం బొల్లికొండకు చెందిన గుగులోత్‌ నిజ్జు, కేసముద్రం మండలం బోడమంచ్యాతండాకు చెందిన భూక్య చంటిలు కష్టపడకుండా సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో గంజాయి వ్యాపారాన్ని మొదలుపెట్టారని భావించారు. ఈ క్రమంలో మహబూబాబాద్‌ మండలం అమనగల్లుకు చెందిన గుగులోత్‌ రవి వద్ద 17 కిలోల ఎండు గంజాయిని కిలో కి రూ . 5 వేల ఖరీదు చేసారు.

ఈ గంజాయిని హైదరాబాద్ లో కిలో కి రూ .15 వేల చొప్పున అమ్మెందుకు రెండు బస్తాలలో పల్సర్ బైక్ పై ఇద్దరిని పంపారు. కల్వల శివారు ఆలేరు రోడ్డు వద్ద ఎస్‌ఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలను చెక్ చేస్తుండగా ఆ పల్సర్ బైక్ ని,ఆ ఇద్దరిని పట్టుబడ్డారు. తహసీల్దార్‌ ఫరీద్‌ సమక్షంలో ఇరువురు నిందితులను అరెస్ట్‌ చేసి, గంజాయి బస్తాలను, బైక్‌ను సీజ్‌ చేసినట్లు తెలిపారు. గంజాయిని పట్టుకున్న ఎస్‌ఐ రమే్‌షబాబు, సిబ్బంది రూరల్‌ సీఐ అభినందించారు. గంజాయిని పట్టుకున్న ఎస్‌ఐ రమే్‌షబాబు, సిబ్బంది రూరల్‌ సీఐ అభినందించారు.

తాజా ఏపీ వార్తలు కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/