పట్టణాల అభివృద్ధి టిఆర్‌ఎస్‌తోనే సాధ్యం

Vemula Prashanth Reddy
Vemula Prashanth Reddy

నిజామాబాద్‌: పట్టణాల అభివృద్ధి టిఆర్‌ఎస్‌తోనే సాధ్యపడుతుందని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. అభివృద్ధి జరగడం కోసం అందరూ టిఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని ఆయన కోరారు. తమ ప్రభుత్వం అధికారం చేపట్టాక అభివృద్ధి ఊపందుకుందని తెలంగాణ రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న మంత్రి మీడియాతో మాట్లాడారు. నిజామాబాద్ లో జరిగిన అభివృద్ధే ఇందుకు నిదర్శనమన్నారు. రోడ్లు, భూగర్భ మురుగు నీటి పారుదల సౌకర్యం, సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ, పార్కులు తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. మేయర్ సీటు ఇచ్చేందుకు ఎంఐఎంతో టిఆర్‌ఎస్‌ ఒప్పందం కుదుర్చుకుందంటూ విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తోన్నాయన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంఐఎంకు మేయర్ స్థానం ఇవ్వమని తేల్చి చెప్పారు. అభివృద్ధి కావాలంటే టిఆర్‌ఎస్‌ కు అశాంతి కావాలంటే ఎంఐఎం, బిజెపిలకు ఓటేయాలని చెప్పారు. ప్రతిపక్షాల ప్రచారాన్ని నమ్మవద్దన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/