ఏపిలో గ్రూప్‌-1 ప్రధాన పరీక్షలు వాయిదా

APPSC
APPSC

అమరావతి: గ్రూప్‌1 మెయిన్స్‌ పరీక్షలు వాయిదా పడింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ సెక్రటరీ పీఎస్ఆర్ ఆంజనేయులు ప్రకటించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఫిబ్రవరి 4 నుంచి 16 వరకు జరగాల్సిన ఏపీపీఎస్సీ గ్రూప్1 మెయిన్స్ వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. సమయం సరిపోదని అభ్యర్థులు చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వచ్చే సోమవారంలోగా కొత్త షెడ్యూల్‌ని ప్రకటిస్తామని ఆంజనేయులు తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/