క‌రీంన‌గ‌ర్ జిల్లా ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరిన కేసీఆర్

కేసీఆర్ పొలంబాట పట్టిన సంగతి తెలిసిందే. సాగునీరందక పొలాలు ఎండుతుంటే రైతన్నలను కలిసి పరామర్శించి వారి కష్టసుఖాలు తెలుసుకుంటున్నారు. రీసెంట్ గా సూర్యాపేట, నల్గొండ పలు ప్రాంతాల్లో పర్యటించి, ఎండిన పంటలను పరిశీలించగా..ఈరోజు కరీంగర్ జిల్లాలో పర్యటించబోతున్నారు. కొద్దీ సేపటి క్రితమే కేసీఆర్ ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లా ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరారు. ఎర్ర‌వ‌ల్లిలోని త‌న వ్య‌వ‌సాయ క్షేత్రం నుంచి కేసీఆర్ రోడ్డుమార్గాన క‌రీంన‌గ‌ర్ జిల్లాకు చేరుకుని, అక్క‌డ ఎండిపోయిన పంట‌ల‌ను ప‌రిశీలించి, రైతుల‌కు భ‌రోసా ఇవ్వ‌నున్నారు.

మరో గంట లో మొగ్దుంపూర్‌కు కేసీఆర్ చేరుకుంటారు. అక్క‌డ ఎండిన పంటలను పరిశీలించి.. రైతులతో ఏర్పాటుచేసిన ముఖాముఖిలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటిగంటకు కరీంనగర్‌లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ నివాసంలో భోజనం చేస్తారు. 2 గంటలకు రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో ఎండిన పంటలను పరిశీలిస్తారు. తర్వాత 3 గంటలకు శాభాష్‌పల్లి వంతెనపైకి చేరుకొని మధ్యమానేరు(శ్రీరాజరాజేశ్వర జలాశయం)ను పరిశీలిస్తారు. సాయంత్రం 4 గంటలకు సిరిసిల్లలోని తెలంగాణభవన్‌కు చేరుకొని మీడియాతో మాట్లాడతారు. 5 గంటలకు తిరుగు ప్రయాణమై ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రానికి చేరుకుంటారు.