ఫోటోస్టూడియోలో..బాలికపై అత్యాచారయత్నం

మైనర్‌ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఫోటోగ్రాఫర్‌

photographer-misbehave-with-minor-girl
photographer-misbehave-with-minor-girl

హైదరాబాద్‌: ఫోటో కోసం వచ్చిన మైనర్ బాలికపై ఫోటో గ్రాఫర్ అఘాయిత్యానికి ప్రయత్నించాడు. ఫోటో దిగేందుకు వెళ్లిన బాలికతో అక్కడున్న ఫోటోగ్రాఫర్ సలీం అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాలిక భయపడి గట్టిగా కేకలు వేస్తూ బయటకు పరుగులు తీసింది. సికింద్రాబాద్ నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సైనిక్ పురిలోని ఆర్.ఎస్ డిజిటల్ ఫోటో స్టూడియోలో ఫోటో దిగేందుకు ఓ బాలిక వెళ్లింది. మైనర్ బాలికతో స్టూడియో యజమాని సలీం అసభ్యంగా ప్రవర్తించాడు . బాలికపై అత్యాచారం చేసే ప్రయతం చేసాడు. దీంతో బాలిక అరుచుకుంటూ బయటకి పరుగులు తీయడంతో స్థానికులు స్టూడియో యజమాని సలీంకి దేహశుద్ది చేసారు. బాలిక తల్లి నెరేడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం గాయాలుపాలైన నిందితుడు సలీం స్థానిక హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు .

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/