చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉంది

భద్రతా సిబ్బందిని 146 నుంచి 67కు తగ్గించారు

kala venkata rao
kala venkata rao

అమరావతి: తీవ్రవాదులు, మావోయిస్టులు, ఎర్ర చందనం స్మగ్లర్లు అసాంఘీక శక్తుల నుంచి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రాణాలకు ముప్పు ఉందని టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావ్‌ అన్నారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. జడప్లస్‌ కేటగిరిలో ఎన్‌ఎస్‌జీ రక్షణలో ఉన్న ప్రతి పక్షనేత భద్రతా సిబ్బందిని 146 నుంచి 67కు తగ్గించారని కళా మండిపడ్డారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌కు తీవ్రవాదుల నుంచి ముప్పు ఉందన్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని తెలిసీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే భద్రత తగ్గించిందని కళా వెంకట్రావ్‌ దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని..వారికి ఏదైనా జరిగితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. గతంలో ప్రభుత్వం కల్పించిన భద్రతా స్థాయిని పునరుద్ధరించాలని కళా వెంకట్రావ్‌ డిమాండ్‌ చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/